తెర వెనుక...నాసామి

SRIDHAR SHARMA
 నమ్మే వాళ్ళుంటే సతీ సావిత్రి తనకు సుపరిచితురాలంటుంది. వినేవాళ్ళుంటే సతీ అనసూయ ఇంటి పక్కనే మా ఇళ్ళని నమ్మబలుకుతుంది. వ్యభిచారమంటే అదేందన్నట్లు తన ముఖాన్ని మూడు వంకర్లు తిప్పుతోంది. తన వళ్ళు అమ్ముకుని సొమ్ము చేసుకుంది చాలక ఇతరులను అదే రోంపిలోకి దింపే యత్నం చేసింది.  కాగా తాజాగా సెక్స్ రాకెట్ కేసులో కటకటాల పాలైన తారాచౌదరి తాజాగా ప్రముఖుల చీకటి రహస్యాలు వెల్లడిస్తానంటోంది. తనను అన్ని రకాలుగా వాడుకున్న వైనం వివరాలు సాక్షాధారాలతో సహా బయట పెడతానంటోంది. చేయని నేరానికి తనను జైలుకు పంపారని చెబుతూనే ఆ ఎంపీతో అన్ని చేశానని, అందుకు తగ్గ సాక్షాలున్నాయని వివరిస్తోంది.  ఈ క్రమంలో వీడియో, ఆడియో రికార్డులున్నాయంటోంది. ఇంతకూ తారా తప్పు చేసినట్టా? చేయనట్టా?. రాష్ర్టంలోని పలువురు ప్రముఖులు రాత్రుళ్ళు తన ఇంటి తలుపులు తడతారని, అయితే తాను తలుపులు తెరవలేదని అంటోంది. అర్థరాత్రుళ్ళు తలుపుతట్టిన వారిపై తారా చౌదరి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు.  పైపెచ్చు తనతో అనేక మంది ముఖ్యులు గంటల తరబడి ఫోన్లలో మాట్లాడతారని చెబుతోంది. పరిచయం లేనివారితో గంటల తరబడి మాట్లాడాల్సిన అవసరం తారాకు ఎందుకొచ్చినట్టో మరి. నాడు సినిమా అవకాశం కోసం నగరానికి వచ్చి నేడు సినిమాలు తీసే స్థాయికి ఎలా? చేరుకుంది. తన గుట్టురట్టు చేసిన వారి గుట్టు విప్పేస్తానంటోంది. తనకు సిఐడీ వారు సహకారమందిస్తే ప్రముఖుల గుట్టును రట్టు చేస్తానని తేల్చిచెబుతోంది. ఎంపికి తనతో ఉన్న సం‘బంధం’ సాక్షాలతో సహా విడమరిచి చూపిస్తానంటోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: