నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ….?
ఇందుమూలంగానే ఈ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నందమూరి అభిమానులు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు భారీ ఎత్తున చేయడానికి అభిమానుల్లో ఇప్పటికే భారీ ఏర్పాటు చేస్తున్నారు. గతంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ గ్యారెంటీ అని అనేక వార్తలు వచ్చాయి అయితే రాను రాను మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుండడంతో రెండు నెలలకు ముందు మోక్షజ్ఞ కి సంబంధించిన ఒక పిక్ సోషల్ మీడియాలో చాలా లావుగా కనబడటంతో మోక్షజ్ఞ సినిమాలకు దూరం గా వుంటూ వ్యాపారం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని అప్పట్లో వార్తలు రావడం జరిగాయి.
ఇటువంటి నేపథ్యంలో తాజాగా 25వ పుట్టినరోజు నాడు కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి స్పష్టమైన వార్త ఒకటి రావడం ఖాయమని ఇందు మూలంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఈ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపపోతున్నట్లు సమాచారం.