సినిమా ధియేటర్ ను ప్రారంభించిన సినీ హీరో రాంచరణ్...
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వంశీ రెడ్డి,విక్రమ్ రెడ్డి,వారి పెద్దలకు శ్యాంసుందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సూళ్లూరుపేట ప్రాంతం అనగానే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రపంచపటంలోలనే ప్రాధాన్యత కలిగిన షార్ ప్రాజెక్టు అని కొద్దిరోజులలో చందమామని ప్రపంచమంతా చూపించగలిగే స్థాయి షార్ ప్రాజెక్టు అని అలాగే నేలపట్టు,పులికాటు,మాంబట్టు ఇలాంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఈ సూళ్లూరుపేట ప్రాంతం అటువంటి సూళ్లూరుపేట లో మరో వి ఎపిక్ థియేటర్ ఇక్కడ నిర్మాణం చేసి సూళ్లూరుపేట ప్రాధాన్యతను చాటుకున్నారని తెలియజేశారు.
ఈ సందర్భంగా 30 వ తారికు నుండి సినిమాలు వీక్షించవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి,వేనాటి రామచంద్రా రెడ్డి,పెళ్లకూరు సత్యనారాయణ రెడ్డి,వైసిపి నాయకులు అల్లూరు అనిల్ రెడ్డి, వైయస్సార్సీపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దబ్బల శ్రీమంత్ రెడ్డి,యువ నాయకుడు శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాంచరణ్ చేతుల మీదుగా ఓపెనింగ్ అయిన ఈ థియేటర్‌కి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.