జీవితా రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ బాలీవుడ్ లో విజయం సాధించిన 2 స్టేట్స్ తెలుగు రీమేక్ తో హీరోయిన్ గా లాంచ్ కావాల్సి వుండే అయితే గత ఏడాది ప్రారంభమైన ఈ చిత్రం 6నెలలు షూటింగ్ జరుపుకుంది కానీ అవుట్ ఫుట్ నచ్చకపోవడం తో ఈసినిమా ను పక్కకు పెట్టారు. అడివి శేష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అయితే సినిమా కు రిపేర్లు చేద్దాం అని మేకర్స్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అలా మొదటి సినిమానే శివానికి చేదు జ్ఙాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమా తరువాత శివాని కి మరో ఆఫర్ రాలేదు. దాంతో ఆమె తన తండ్రి హీరోగా నటించిన 'కల్కి' అనే సినిమాకు సహ నిర్మాత గా వ్యవహరించింది. ఇది కూడా ఆమె కు నిరాశనే మిగిల్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని చవి చూసింది.
ఇక ఇప్పుడు శివాని మరో సారి హీరోయిన్ గా రీలాంచ్ అయ్యేందుకు ఎదురుచూస్తుంది. అందులో భాగంగా తాజాగా ఓ ఫొటో షూట్ లో పాల్గొంది శివాని. ఇప్పుడు షూట్ లోని ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ ఫోటో లో హాట్ లుక్స్ తో కనిపించింది శివాని. మరి ఆమె ను ఎవరు హీరోయిన్ గా రీ లాంచ్ చేస్తారో చూడాలి. ఇక శివాని రాజశేఖర్ చెల్లెలు శివాత్మిక కూడా ఈ ఏడాది దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈసినిమాలో హీరోగా నటించాడు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. ఇక శివాత్మిక కూడా ప్రస్తుతం మరో ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది.