ఈ మద్య ప్రేమలో ఎంత త్వరగా పడుతున్నారో బ్రేకప్ కూడా అంతే త్వరగా చెప్పుకుంటున్నారు. ఇది సామాన్యలు నుంచి సెలబ్రెటీల వరకు జరుగుతున్న తంతే. అంతే కాదు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడితే డేటింగ్ (సహజీవనం) చేస్తూ సంవత్సాలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. కొంత కాలం తర్వాత ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చాయో వెంటనే బ్రేకప్ చెప్పుకుంటున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ అందాల రాశి గౌతమి దాదాపు పదమూడు సంవత్సరాలు సహజీవనం సాగించి ఆ మద్య విడిపోయారు.
ఇలా ఎంతో మంది సెలబ్రెటీలు ప్రేమలో మునిగిపోయి..అంతలోనే విడిపోయారు. తాజాగా కన్నడ నాట నటిగా, రాజకీయ నాయకురాలిగా పాపులర్ అయిన రమ్య గురించి అందరికీ తెలిసిందే. ఈమె సినిమాలు, రాజకీయాల్లో కన్నా తన చిత్రమైన పనులతో ఎక్కువ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేది. రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యుడు చిత్రంలో నటించింది. స్టార్ హీరో సూర్య సరసన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో నటించింది. గత కొంత రమ్య పెళ్లి గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నాకు ఇక రాజకీయాలు, సినిమాలు వద్దు నా ప్రియుడే ముద్దు అంటూ ఇటీవల ఆమె అన్నట్లు సోషల్ మీడియాలోతెగ వార్తలు వచ్చాయి. కర్ణాటకలోని మాండ్య ప్రాంతం నుంచి ఆమె 2013లో ఎంపీగా గెలుపొందారు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు రమ్య. ఆమె కాంగ్రెస్ పార్టీలో నేతగా, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు పక్కన బెట్టి తన బాయ్ ఫ్రెండ్ రఫెల్ వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తల్లి రంజిత తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రమ్య ప్రస్తుతం ఎవరిని వివాహం చేసుకోవడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇంతలోనే ఆమె మరో బాంబ్ పేల్చారు.
రమ్య, రఫేల్ మద్య విభేదాలు వచ్చాయని..వారు బ్రేకప్ చెప్పుకున్నారని తెలిపింది. అందుకు కారణం పెళ్ళైన తర్వాత దుబాయ్ లో స్థిరపడాలనేది రఫెల్ కోరిక. కానీ ఇండియాని విడిచిపెట్టడం రమ్యకు ఇష్టం లేదట. ఈ కారణంతోనే వారి మద్య తేడా వచ్చి విడిపోయారని చెబుతుంది. మరి ఇది ఎంత వరకు నిజయో తెలియాల్సి ఉంది.