పూరీ జనన్నాథ్ ఇటీవల దర్శకత్వం వహించిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`కు సీనియర్ హీరోయిన్ ఛార్మి నిర్మాత. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రంలో నభా నటేశ్ మరియు నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. పూరి టేకింగ్ కి రామ్ ఎనర్జీ యాడ్ అవ్వడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
అయితే టెంపర్ సినిమా తరువాత హిట్ ముఖమే చూడని పూరీకి మరియు మూడేళ్ల తర్వాత రామ్‌కు మంచి హిట్ అందించింది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ రన్ దాదాపు క్లోజ్ అయ్యింది. విడుదలైన మూడు రోజుల్లో రూ. 36 కోట్లు వసూలు సంపాధించి.. ఆరు రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా రూ. 34.55 కోట్ల థియేట్రికట్ షేర్ రాబట్టుకుంది. మరియు ఈ సినిమ థియేట్రికట్ హక్కులు రూ. 17 కోట్లకు అమ్ముడయ్యాయి.
బీ, సీ సెంటర్లలలో ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఇందులో పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. ఈ సినిమాను కొన్న వారికి డబుల్ ప్రాఫిట్ అందించింది. ఇక ఈ సినిమా క్లోజింగ్ షేర్స్ ఇలా ఉన్నాయి.
ఇస్మార్ట్ శంకర్ క్లోజింగ్ షేర్ (రూ.కోట్లలో) :
నైజాం - 13.60
సీడెడ్ - 5.45
వైజాగ్ - 3.80
ఈస్ట్- 2.05
వెస్ట్ - 1.75
కృష్ణా - 2.0
గుంటూరు - 1.95
నెల్లూరు - 1.05
------------------------------------
ఏపీ, తెలంగాణ = 31.65 కోట్లు
------------------------------------
రెస్టాఫ్ ఇండియా - 1.90
రెస్టాఫ్ వరల్డ్ - 1.0
------------------------------------------------
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ - 34.55 కోట్లు
------------------------------------------------