పాగల్ గా ఫలక్ నుమా దాస్
ఇక ఈచిత్రం తరువాత విశ్వక్ సేన్ మరో సినిమాకు సైన్ చేశాడు. అయితే ఈసారి ఏకంగా టైటిల్ తోనే రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు ఈ హీరో. నూతన దర్శకుడు నరేష్ రెడ్డి కుప్పిలి డైరెక్షన్ లో విశ్వక్ సేన్ ,పాగల్ అనే చిత్రంలో నటించనున్నాడు. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక "టాటా బిర్లా మధ్యలో లైలా" ,"మేం వయసుకు వచ్చాం ", "సినిమా చూపిస్తా మామా" లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్ ఇటీవల కొత్త వాళ్ళతో "హుషారు" అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను నిర్మించి సూపర్ హిట్ కొట్టారు. ఇక ఈ పాగల్ నుకూడా లక్కీ మీడియా బ్యానర్ ఫై బెక్కం వేణుగోపాలే నిర్మించనున్నాడు. కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోనున్నారట. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.