కొరటాల శివ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్..!
అసలు హరీష్ శంకర్ సోషల్ మీడియా లో చిరంజీవి ఫోటో ని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ ఏమిటంటే.. ''ఈ ఫోటోని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను.. మొదటిసారి నా స్నేహితుడు కొరటాల శివపై జెలసీగా ఉంది. వీరు ఎలాంటి సినిమా చేయబోతున్నారో అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది'' అంటూ హరీష్ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ కి నెటిజన్ల నుండి భారీ స్పందన వస్తోంది.
ఈ క్రమంలో కొంత మంది మెగా అభిమానులు చిరంజీవితో మీరు కూడా సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారో అలాగే చిరంజీవికి కూడా హిట్ ఇవ్వాలని అప్పట్లో చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి మాస్ సినిమా ఒకటి మీ నుండి ఆశిస్తున్నాము అంటూ మెగా అభిమానులు హరీష్ శంకర్ ని కోరారు. మొత్తం మీద చిరంజీవి ఫోటో ని ఉద్దేశించి డైరెక్టర్ హరీష్ శంకర్ కొరటాల శివ పై సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానులను బాగా అల్లరిస్తున్నట్లు అర్థమవుతుంది.