బెడిసికొట్టిన విక్రమ్ ఫార్ములా..?
సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లు కూడా బాగానే చేసినప్పటికీ తెలుగులో ఈ సినిమా కనీసం మంచి ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేకపోయింది. తెలుగులోనే కాక తమిళం లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. చివరికి తమిళ్ క్రిటిక్స్ కూడా సినిమా ఏమాత్రం బాలేదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. స్టోరీలో ఏమాత్రం కొత్తదనం లేదని చాలా ఓల్డ్ కథగా సినిమా ఉందని..రకరకాలుగా సినిమాపై కామెంట్లు చేస్తున్నారు క్రిటిక్స్.
నటన పరంగా టాలెంట్ ఉన్నా గాని కథను ఎంచుకోవడం విషయంలో విక్రమ్ దెబ్బ తింటున్నాడాని...ఎంతో నమ్మకంతో సినిమా రెండు భాషల్లో రిలీజ్ చేసిన విక్రమ్ ఫార్ములా బెడిసికొట్టిందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదే కామెంట్ చేస్తున్నారు.