‘RRR’ సినిమాపై కొత్త డౌట్ పెట్టుకున్న అభిమానులు..?
అయితే ప్రస్తుతం షూటింగ్ విషయమై చాలా ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో రెండు హీరోల అభిమానులు..వచ్చే సంవత్సరానికి ఈపాటికి సినిమా విడుదల అవుతుందా అంటూ కొత్త డౌట్ తెరపైకి తీసుకువచ్చి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు పెట్టుకున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి షూటింగ్ సమయంలో గాయాలయ్యాయని దాదాపు కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆగిపోయిన క్రమంలో..ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి ఈపాటికి సినిమా విడుదల అవుతుందా..? అంటూ ప్రశ్నలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవల బాహుబలి తర్వాత సాహో సినిమా ఆగస్టు 15న విడుదల అవుతుందని ప్రకటించి..వెంటనే సినిమా విడుదల చేసిన వాయిదా వేసిన నేపథ్యంలో..ఈ విధంగానే ‘RRR’ సినిమా విషయంలో కూడా జరుగుతుందోని...ఇప్పటి నుండే తెగ టెన్షన్ పడుతున్నారు నందమూరి — మెగా అభిమానులు. మరి ‘RRR’ సినిమా అనుకున్న సమయానికి రాజమౌళి సినిమా విడుదల చేస్తాడో లేదో చూడాలి.