12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
అయితే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో..పూరి జగన్నాథ్ తన 12 సంవత్సరాల డ్రీం నెరవేర్చుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఒకానొక సందర్భంలో..అనగా మహేష్ బాబు పోకిరి సినిమా చేసిన క్రమంలో సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుటుంబంతో కలిసి 15 రోజుల వెకేషన్కు వెళ్లాడట. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటి టూర్ ఏదీ వెళ్లలేదని ఇటీవల వెల్లడించాడు.
అంతేకాకుండా గత పన్నెండేళ్లలో ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా హాలిడే తీసుకోలేదని కుటుంబంతో కలిసి ఒక టూర్కు కూడా వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చాడు పూరి. అయితే తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అవడంతో రెండు నెలలపాటు హాలిడే ట్రిప్ వేయాలని..పూర్తిగా ఫిట్ గా మరి...విదేశాలకు వెకేషన్ వెళ్లి పూర్తి స్క్రిప్టు రాసుకుని వస్తానని ఇటీవల పూరి జగన్నాథ్ పేర్కొన్నట్లు ఫిలింనగర్ లో టాక్. మొత్తం మీద ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి.