వాళ్ళిద్దరి పెళ్ళికి కారణం నిత్యానేనట

Krishna
మలయాళ నటుడు ఫాజిల్, "రాజా రాణి" ఫేమ్ నజ్రియాలు ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే, అయితే వీరిద్దరి పెళ్లికి కారణం తనేనంటోంది ఒక నటి. .ఆ నటి మరెవరో కాదు నిత్యా మీనన్. వాళ్ళిద్దరి పెళ్ళికి, నిత్యాకి సంబంధం ఏంటంటే.. మలయాళ సూపర్ హిట్ చిత్రం "బెంగళూరు డేస్" గురించి తెలిసిందే.. 

2019లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసందే. అయితే ఇందులో  నజ్రియా పాత్రకు మొదటిగా నిత్యామీనన్ ను తీసుకున్నారట. అయితే ఇతర చిత్రాల్లో బిజీగా ఉండడం వల్ల "బెంగళూరు డేస్" లో అంటించే అవకాశాన్ని నిత్య వదులుకుందిట, దీంతో నిత్య ప్లేస్ లో నజ్రియాని వరించింది, అలా ఆ చిత్రంలో నటించిన నజ్రియా- ఫాజిల్ ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. దీంతో వాళ్లిదరు  నిత్యా ఎక్కడ కనిపించినా "మా పెళ్ళి ని వల్లే జరిగింది"  అని  గొప్పగా అంటుంటారని నిత్యామీనన్‌ చెప్పుకొచ్చింది. 

ఇక ప్రస్తుతం జయలలిత బయోపిక్ లో నటిస్తున్న నిత్యామీనన్ , మెగాస్టార్ చిరంజీవి "సైరా" చిత్రంతో పాటు ప్రతిష్టాత్మక "ఆర్ ఆర్ ఆర్" చిత్రంలో ఒక పాత్రను దక్కించుకుంది. రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని ప్రేమించే గిరిజన యువతిగా నిత్య కనిపించబోతున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: