మౌనం లో అసహనం జూనియర్ పై పెరిగిపోతున్న ఒత్తిడి !

Seetha Sailaja
ఆంధ్రప్రదేశ్ లో వచ్చేనెల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేస్తోంది. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికలో ముందుగా అడుగులు వేస్తూ జనంలోకి చొచ్చుకుపోతూ తమ సంక్షేమ పదకాలు మాత్రమే తమ పార్టీని గెలిపిస్తాయి అని పార్టీ అభ్యర్ధులకు తెలుగుదేశం అధినాయకత్వం ధైర్యం చెపుతోంది.

ఇలాంటి పరిస్థుతులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తల నుండి జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చి పడుతున్న సందేశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఈసారి జరగబోతున్న ఎన్నికలలో తెలుగుదేశం విజయం అంత సులువు కాదని ప్రచారంలో పార్టీ ముందడుగులో ఉండాలి అంటే జూనియర్ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల ప్రచారానికి రావాలని కోరుతూ అతడి సెల్ కు వస్తున్న వేలాది మెసేజ్ లకు జూనియర్ మౌనమే సమాధానంగా వస్తోంది అని వార్తలు వస్తున్నాయి. 

ఈసారి జరగబోతున్న ఎన్నికల పోరులో ప్రజల మనోగతం అంచనా వేయడం చాల కష్టంగా ఉందని దీనితో కేవలం సంక్షేమ పదకాలు మాత్రమే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయి అంటే అవివేకం అంటూ వాస్తవ పరిస్థితిని తెలుగుదేశం కార్యకర్తలు జూనియర్ దృష్టికి తీసుకు వస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రస్తుతం పార్టీకి జనాకర్షణ కలిగి మంచి ఉత్తేజకరమైన ఉపన్యాసాలు ఇవ్వగల నాయకులు లేరనీ ఈ పరిస్థుతులలో జూనియర్ అవసరం ఉంది అంటూ జూనియర్ కు వేలాది సంఖ్యలో మెసేజ్ లు వచ్చిపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే తనకు వస్తున్న ఈ అసంఖ్యాక మెసేజ్ లకు కనీసం జూనియర్ స్పందించకుండా తన మౌనముద్రను కొనసాగిస్తున్నట్లు టాక్. ఎన్టీఆర్ బయోపిక్ గురించి కనీసం రెండు మాటలు కూడ మాట్లాడని జూనియర్ అదేవిధంగా తన సోదరి కుకట్ పల్లిలో పోటీ చేసినా పట్టించుకోని జూనియర్ అదేవిధమైన మౌనముద్రను తన అభిమానుల నుండి వస్తున్న సందేశాల విషయమై కూడ కొనసాగించడం ఇక్కడి ట్విస్ట్.   త్వరలో కలకత్తాలో ప్రారంభం కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కోసం సుమారు 45 రోజులు జూనియర్ కలకత్తాలోనే ఉంటున్న పరిస్థుతులలో తన తాత పెట్టిన తెలుగుదేశ కార్యకర్తల అభిప్రాయాలకు స్పందించకుండా ఈ మౌనాన్ని రాబోయే ఎన్నికలు పూర్తి అయి ఫైలితాలు వచ్చేదాకా కొనసాగించే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: