ఆ సెక్సీ సింగర్.. నాలుగోసారి పెళ్లికి రెడీ అయ్యిందోచ్..
జెన్నిఫర్ లోపెజ్.. పాశ్చాత్య సంగీతంపై అవగాహన ఉన్నవారికి బాగా పరిచయం ఉన్న పేరు ఇది. సంగీతంతోనే కాదు.. తన ప్రేమ, కామ కలాపాల ద్వారా కూడా ఈ భామ బాగానే పాపులర్ అయ్యింది. తరచూ మీడియాలో ఈమె గురించిన గాసిప్స్ బాగా చక్కర్లు కొడుతుంటాయి.
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ అమ్మడు తాజాగా.. నాలుగోసారి పెళ్లిపీటలెక్కబోతోంది. మాజీ బేస్‌బాల్ క్రీడాకారుడు అలెక్స్ రాడ్రిగేజ్‌తో జెన్నిఫర్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మిడియా ద్వారా ప్రకటించేసారు.
అలెక్స్.. లోపేజ్ చేతికి తొడిగిన వజ్రపు ఉంగరం ఫొటోను వీరు పోస్ట్ చేశారు. అలెక్స్ కంటే లోపేజ్ ఆరేళ్లు పెద్ద. రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. అంతే కాదు.. లోపేజ్‌కు 11 ఏళ్ల కవల పిల్లలకు తల్లి కూడా. అలెక్స్ కూడా ఇంతకుముందే పెళ్లయినవాడే. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కొన్నాళ్ల క్రితం జెన్నిఫర్ ను మాజీ భర్త ఒకరు బాగా ఇబ్బంది పెట్టేశాడు.తను నగ్నంగా, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తీసిన వీడియో టేపు దృశ్యాలు మీడియాకు అందించాడు. అప్పట్లో ఇది చాలా హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై జెన్నిఫర్ కోర్టుకు కూడా ఎక్కింది. అయినా ఏమాత్రం బెదరిని ఆ మాజీ మొగుడు అలా చాన్నాళ్లు జెన్నిఫర్ ను ఇబ్బంది పెట్టాడు. మరి ఈ నాలుగో పెళ్లయినా సక్సస్ కావాలని కోరుకుందాం.