పవన్‌ జేబులో ఎప్పుడూ ఆలీ ఫోటో ఉంటుందా.. నిజమా..?

Chakravarthi Kalyan
హీరో పవన్ కల్యాణ్ కి కమెడియన్ అలీ ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ సినిమాలో అలీకి చక్కటి పాత్రలు లభిస్తుంటాయి. పవన్ కల్యాణ్‌కు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో అలీని కూడా చెబుతుంటారు.



పవన్, అలీ స్నేహానికి గుర్తుగా పవన్ కల్యాణ్ పర్సులో ఎప్పుడూ అలీ ఫోటో ఉంటుందా.. ఈ అనుమానమే ఇటీవల ఓ టీవీ ఛానల్ విలేఖరికి వచ్చింది. అలీతో ముఖాముఖి నిర్వహించినప్పుడు ఇదే ప్రశ్నను అలీకి సంధించాడు. పవన్ పర్సులో మీ ఫోటో ఉంటుందట కదా.. ఎవరో సెలబ్రెటీ అన్నట్టు గుర్తు అంటూ కూపీ లాగాడు.



ఇందుకు అలీ స్పందిస్తూ.. అబ్బే నా ఫోటో పవన్ దగ్గర ఎందుకు ఉంటుంది అంటూ ఆ వార్తను ఖండించాడు. పవన్ ఫోటోయే నా దగ్గర ఉంటుంది అంటూ సమాధానం చెప్పాడు. పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌ గా రాజకీయాల్లోకి వచ్చాడని.. అలీ అభిప్రాయపడ్డారు.



జనసేనలో చేరతానని పవన్ దగ్గరకు వచ్చే వారిని ఆయన మీరేమి ఆశించి వస్తున్నారని ప్రశ్నిస్తారని అలీ చెప్పాడు. తన సమక్షంలో పవన్ కల్యాణ్ చాలామందితో మాట్లాడరాని ఆయన ఏం అడుగుతాడో తనకు తెలుసని చెప్పాడు. అధికారం, డబ్బు ఆశించి జనసేనలో చేరొద్దని.. ఏమీ ఆశించకపోతేనే పార్టీలోకి రావాలని పవన్‌ చెబుతుంటారని అలీ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: