ప్రభాస్ భూకబ్జాదారుడన్న మాటకు హైకోర్టు అభ్యంతరం

బాహుబలి సీరిస్ ద్వారా  విఖ్యాతి గాంచీన రెబల్ స్టార్ ప్రభాస్ రియల్-లైఫ్ లో బాహుబలి అనిపించుకోలేక పోవటమే కాదు, ప్రభుత్వ లాయర్ ఆయన్ని భూకబ్జాదారుడని సంబోదించారు.  భూవివాదానికి సంబంధించి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగువారి ప్రియతమ సినీనటుడు ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీల్ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి, రియల్ లైఫ్‌ లో విలన్లతో తలపడి ఉండరు అంటూ  న్యాయస్థానం పేర్కొంది.  సామాన్యుడి విషయంలో అయితే ఈపాటికే తాము మధ్యంతర ఉత్తర్వులు విడుదలజేసే వాళ్ళమని, ప్రభాస్ లాంటి ప్రముఖుని విషయంలో ఆచితూచి వ్యవహరించామని హైకోర్టు పేర్కొంది.

ఈ సంధర్భంగా ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, ప్రభాస్ భూకబ్జాదారుడని ఆరోపించగా! - ఆ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది 



ఒకవేళ ప్రభాస్ భూకబ్జాదారుడైనప్పటికీ అతనికి సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభాస్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే, ఆ భూమిని కబ్జా చేసిన మిగతావాళ్ళు కూడా,  ఇందుకు అర్హులవుతారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, ప్రభాస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తాను కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్‌ గెస్ట్ హౌజ్‌ కట్టుకున్నారని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది.

అసలు చరిత్ర ఏమంటే: 

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం పరిధిలోని పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్‌ 5/3 లో ప్రభాస్‌ కు చెందిన 2,083 చదరపు అడగుల స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో తమ కౌంటర్‌ లో రెవెన్యూ అధికారులు ఇప్పటికే హైకోర్టు వివరించారు. తనస్థలం విషయంలో రెవెన్యూ అధికారులుజోక్యం చేసుకోవడా న్నిసవాల్‌ చేస్తూ ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్‌ గత బుధవారం అత్యవసరంగా ‘లంచ్‌-మోషన్‌’ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005 లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌ రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

గెస్ట్-హౌస్ స్థలం ప్రభాస్‌ తండ్రి గతంలో కొనుగోలు చేశారని, క్రమబద్ధీకరణ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు  కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా గెస్ట్‌ హౌస్‌ను సీజ్‌ చేశారని తెలిపారు. 


వారసత్వంగా సంక్రమించిన ఆస్థికి గత పదమూడుసంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ఆస్తిపన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు ఉన్నాయని ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని ₹1.05 కోట్ల క్రమబద్ధీకరణ ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీ కరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.  అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు ఏదో కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు.

వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన కేసులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీం కోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ  తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు
అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్‌ లో పేర్కొన్నారు.  అంతేకాక పిటిషనర్‌ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని పైగా ఉల్లంగించారని తెలిపారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చర్యలు పౌరునిగా తనకున్న హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: