జాన్వి గురించి విజయ్ దేవరకొండ మనసులో మాట!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ హీరోగా ఎవరంటే వెంటనే విజయ్ దేవరకొండ అని అంటారు.  మనోడు నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధించడమే కాదు..బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇక గీతాగోవిందం చిత్రం అయితే ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా ఇలా వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ మద్య నోటా చిత్రం కాస్త దెబ్బతీసినా..నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చిత్రాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. 

ఈ హీరోతో నటించేందుకు హీరోయిన్లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు.  తాజాగా విజయ్ తో యాక్ట్ చేయాలనుందని  కాఫీ విత్ కరణ్ షోలో శ్రీ దేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అంటే ఇష్టమని చెప్పింది. ఆయనతో ఒక సినిమా కూడా చేస్తానని చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. 

తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ..ఈ మద్య టాక్సీవాలా' ప్రమోషన్స్ సమయంలో తాను కరణ్ జోహర్ ఆఫీసుకి వెళ్లినట్టుగా  చెప్పాడు. కుదిరితే కరణ్ జోహార్ చిత్రంలో నటించే ఛాన్స్ ఉందని అన్నారు. ఇక  జాన్వి కాంబినేషన్ లో ఒక చిత్రం చేస్తానని చెప్పాడు. ప్రజెంట్ విజయ్ డియర్ కామ్రేడ్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: