విజయ్ దేవరకొండ‘టాక్సీవాలా’రిలీజ్ డేట్ వచ్చేసింది!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో కేవలం మూడు చిత్రాలతోనే స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు విజయ్ దేవరకొండ.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ లో కీలక పాత్ర పోషించాడు.  తరుణ్ బాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిచూపులు’ చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఇక సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో బోల్డ్, అగ్రసీవ్ గా కనిపించిన విజయ్ దేరవకొండ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.

ఈ మద్య పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతాగోవిందం’ చిత్రంలో కామెడీ, సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.  ఈ చిత్రంతో విజయ్ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు.  అయితే ఈ చిత్రం కంటే ముందు ‘టాక్సీవాలా’ చిత్రంలో నటించాడు..దానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. కానీ ఈ చిత్రం రిలీజ్ విషయంలో అనుకోని అవాంతరాలు వస్తున్నాయి.  ఈ మద్య విజయ్ నటించిన ‘నోటా’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  కానీ హీరోగా మనోడి కెరీర్ మాత్రం సక్సెస్ పుల్ గా సాగుతుంది. 

తాజాగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీ వాలా' చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 16వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  ఒక టాక్సీవాలా .. ఒక ప్రేతాత్మ చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం కొనసాగుతుంది. ఉత్కంఠభరితమైన .. ఉద్వేగభరితమైన కథాకథనాలతో ఈ చిత్రం నడుస్తుందట. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చేస్తోన్న విజయ్ దేవరకొండ, ఆ చిత్రం షూటింగ్ పూర్తికాగానే, 'టాక్సీవాలా' ప్రమోషన్స్ లో పాల్గొంటాడని అంటున్నారు. ఈ చిత్రంలో దేవరకొండ సరసన ప్రియాంక జవల్కర్ .. మాళవిక నాయర్ కథానాయికలుగా నటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: