‘దేవదాస్’వినాయక చవితి స్పెషల్ సాంగ్ అదుర్స్!
తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీగా వస్తున్న ‘దేవదాస్’ ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్ తో దుమ్మురేపుతుంది. మొదటి సారిగా వెండితెరపై కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న ‘దేవదాస్’ చిత్రం నుంచి తాజాగా గణేషుడికి సంబంధించిన ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్, లిరికల్ వీడియోలతో సందడి చేస్తున్నారు.
రేపు 'వినాయకచవితి' కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాలోని వినాయక నిమజ్జన ఉత్సవానికి సంబంధించిన పాటను వదిలారు."లక లక లకుమీకరా లంబోదరా .. జగ జగ జగదోద్ధారా విఘ్నేశ్వరా . . లక లక లకుమీకరా లంబోదరా .. రకరకముల రూపాలు నీవే దొరా .. వెళ్లి రారా .. మళ్లీ రారా .. ఏడాదికోసారి మాకై దిగిరారా .." అంటూ ఈ పాట కొనసాగుతోంది. మణిశర్మ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. మణిశర్మ సంగీతం ఆకట్టుకునేలా వున్నాయి. అనురాగ్ కులకర్ణి .. శ్రీకృష్ణ ఈ ఉత్సవం పాటను మంచి ఉత్సాహంతో ఆలపించారు. వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి జనం నాల్కలపై నాట్యం చేసే సినిమా పాటల్లో ఒకటిగా ఈ పాట నిలిచిపోతుందని చెప్పొచ్చు.