పవన్ సోషల్ సైంటిస్ట్ పదప్రయోగం పై సెటైర్లు !

Seetha Sailaja
పవన్ కల్యాణ్  ‘జనసేన’ శతఘ్ని టీమ్ పవన్ ను సోషల్ సైంటిస్ట్ గా ప్రకట్టిస్తూ పవన్ పుట్టినరోజునాడు విడుదల చేసిన పోస్టర్ పై తీవ్రమైన సెటైర్లు పడుతున్నాయి. గెడ్డం పెంచుకుని హార్వర్డ్ యూనివర్సిటీలోఉపన్యాసం ఇచ్చినంత మాత్ర్రాన సోషల్ సైంటిస్ట్ అయిపోతాడ అంటూ కొందరు పవన్ వ్యతిరేకులు ఘాటైన సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు ఇంతవరకు సమాజంలో    సోషల్ యాక్టివిస్ట్ లు మాత్రమే ఉన్నారని ఈకొత్త సోషల్ సైంటిస్ట్ ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చాడు అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 

జీవితాన్నే సమాజం కోసం అంకితం చేసిన వారిని సంఘ సంస్కర్తలుగా పిలుస్తారని అయితే పవన్కళ్యాణ్ ప్రజాసేవలో చేసిన నిస్వార్ధ సేవ ఏమిటి అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దీనితో పవన్ పుట్టినరోజునాడు పవన్ వీరాభిమానులు పవన్ ను సోషల్ సైంటిస్ట్ గా ప్రమోట్ చేయడం కోసం చేసిన వ్యూహాత్మక ఎత్తుగడలు అంతగా విజయవంతం కాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా నిన్న  పవన్ కళ్యాణ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్‌ గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు ‘జనసేన’ పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని పవన్ ను విపరీతంగా ప్రమోట్ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ను లైన్లో పెట్టేసింది. ఈ క్రమంలో సినిమా పొలిటికల్ సర్కిల్స్ మొత్తం పవన్ కళ్యాణ్ హ్యాష్ టాగ్ మీదే పడిపోయారు. 

ఈ తాకిడి వల్ల హైదరాబాద్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో #HBDJanaSenaniPawanKalyan ట్యాగ్ వేలం వెర్రిగా మారిపోయింది అని వార్తలు వస్తున్నాయి. దాదాపు మూడు మిలియన్ల ట్వీట్లు ఈ ట్యాగ్‌తో నడిచినట్లు వార్తలు వస్తున్నాయి. మరింత ఆశ్చర్యకరంగా ప్రధాని మోదీ ప్రారంభించిన ‘ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీసుల’కు సంబంధించిన హ్యాష్‌ టాగ్‌ని సైతం ‘హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్’ హ్యాష్‌ టాగ్ దాటిపోయింది అని తెలుస్తోంది. దీనితో నిన్నటి పవన్ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ అభిమానులకు అదేవిధంగా పవన్ వ్యతిరేకులకు మధ్య కామెంట్స్ వార్ గా మారిపోయింది. అయితే పవన్ మాత్రం ఈ విషయాలను ఏమి పట్టిచుకుండా తన సహాజ సిద్ధమైన మౌనాని కొనసాగిస్తూ తన సన్నిహితులకు కూడ అందుబాటులో లేకుండా మౌన ముద్ర వవహించినట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: