సమత ట్విట్ పై నెటిజన్ల ఆగ్రహం!

siri Madhukar
ఈ మద్య కొంత మంది హీరోలు, హీరోయిన్లు చేస్తున్న ట్విట్స్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.  సెలబ్రెటీలు చేసే ట్విట్స్ ఆచీ..తూచీ చేయాల్సి వస్తుంది.  ముఖ్యంగా తమకన్నా పెద్ద వాళ్లను గారు, సార్ అని సంబోదించకుండా ఏమాత్రం ట్విట్ చేసిన నెటిజన్లు వారిని కడిగి పడేస్తున్నారు.  ఆ మద్య మహేష్ చేసిన ట్విట్ కి ఓ హీరోయిన్ సార్ అని సంబోధించకపోవడంతో..ఆమెను మహేష్ ఫ్యాన్స్ ఒక్క ఆట ఆడుకున్నారు.  ఇలా పలువురు హీరోయిన్లు ట్విట్ చేసిన తర్వాత నాలుక కరుచుకున్న సంఘటనలు చాలా జరిగాయి.

తాజాగా అక్కినేని సమంత కూడా ఇదే పొరపాటు చేసి వెంటనే సరిచేసుకుంది.  విషయానికి వస్తే..ఈ రోజు ప్రముఖ నటుడు..తెలుగు దేశం పోలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.  దాంతో సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.  ఈ నేపథ్యంలో అక్కినేని సమంత కూడా వెంటనే హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ సమంత చేసిన ట్వీట్ చేశారు..కానీ అదే ఆమెకు తలనొప్పి అయ్యింది.   

పొరపాటున హరికృష్ణ తరవాత ‘గారు’ లేకుండా సమంత ట్వీట్ చేయడంతో ట్విట్టర్‌లో రచ్చ మొదలైంది.  అక్కినేని ఫ్యామిలీ కోడలు..ఆ మాత్రం గౌరవం తెలియదా..పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకో’ అంటూ సమంతకు నెటిజన్లు దుమ్ముదులిపారు.  దాంతో వెంటనే తన పొరపాటును గ్రహించిన సమంత తొలి ట్వీట్‌ను డిలీట్ చేసి మళ్లీ మరో ట్వీట్ చేశారు. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందు ట్వీట్‌ను స్క్రీన్ షాట్‌లు తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు. 
#RIPHarikrishnaGaru Shocked and saddened . Strength to the family in this difficult time .

— Samantha Akkineni (@Samanthaprabhu2) August 29, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: