నా సోదరులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి భగవంతున్ని ప్రార్థిస్తున్నా : మహేష్ బాబు

frame నా సోదరులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి భగవంతున్ని ప్రార్థిస్తున్నా : మహేష్ బాబు

siri Madhukar
తెలుగు ఇండస్ట్రీలో అంతా ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయింది.  నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.   
Image result for harikrishna mahesh babu

తన అభిమాని తనయుడి పెళ్లి వేడుకల కోసం వెళ్తున్న ఆయన నార్కట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మరణించడంతో ఒక్కసారే తెలుగు చిత్ర పరిశ్రమ షాక్ తిన్నది.  ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
Image result for hari krishna dead

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు  'హరికృష్ణ గారు హఠాన్మరణం చెందారన్న వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా సోదరుడు తారక్ కు, అతని కుటుంబసభ్యులకు ఈ విషాదకర సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు.

Image result for hari krishna dead

ఇక  హరికృష్ణ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. సినీ పరిశ్రమ ప్రముఖులు శ్రీకాంత్, అల్లరి నరేష్, బ్రహ్మాజీ, అనిల్ రావిపూడి, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మాజీ, సాయి ధరమ్ తేజ్, శ్రీనివాసరెడ్డి, గౌతమి, మంచు లక్ష్మి, గోపీచంద్ మలినేని, దేవిశ్రీ ప్రసాద్, మంచు మనోజ్, నివేదా థామస్, అల్లు శిరీష్ తదితరులతో పాటు తమిళ నటుడు శరత్ కుమార్ హరికృష్ణ మృతికి సంతాపం తెలిపారు.

Deeply saddened by the news of Harikrishna garu's untimely demise. May his soul rest in peace. Strength and love to my brother @tarak9999 and his entire family in this time of grief.

— Mahesh Babu (@urstrulyMahesh) August 29, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: