
లైఫ్ స్టైల్: మహిళలు పట్టు చీరల సంరక్షణలో ఈ పొరపాటు చేస్తున్నారా..?
చీరను ఎప్పుడూ కూడా డ్రై క్లీనింగ్ వంటివి చేయాలి ఇది చాలా సున్నితమైన పద్ధతి.. చాలా కఠినమైన డిజార్టీ సభ్యులను సైతం ఎక్కువగా ఉపయోగించకూడదట. దీనివల్ల చీర కూడా పాడవుతుంది.
ఎవరైనా చీరను ఇంట్లోనే ఉతుక్కోవలసిన పరిస్థితి వచ్చిందంటే.. చల్లని నీటిని తీసుకొని కొంత మేరకు షాంపును ఉపయోగించి చీరను మాత్రం పిండకూడదట.అలాగే నీడలో ఆరబెట్టాలి.
తేమ వల్ల చీరకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే సిలికా జెల్ ప్యాకెట్స్ ఉపయోగించాలి. ఇవి చీరలో ఉండే తేమను సైతం పీల్చుకుంటాయట.
చీరని ఎక్కువ నెలలపాటు ఒకే చోట నిల్వ ఉంచకుండా చూసుకోవాలి.. ఒకే చోట నిల్వ ఉంచితే కచ్చితంగా మరకలు లేకపోతే ఇనుముకి సంబంధించిన మరకలు ఉంటాయి. అందుకే కనీసం నెలలో ఒకసారి అయినా గాలికి ఆరవేసి మళ్లీ మడత పెట్టి భద్ర పరుచుకోవాలి.
చీరలను సైతం డైరెక్ట్ గా వేడి ఐరన్ తో ఐరన్ చేయకుండా తక్కువ వేడిలో ఉండేలా ఐరన్ చేయాలి అలాగే చీరను మడతలు పెట్టేటప్పుడు లోపల కాగితం వంటి వాటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
చీరలను జాగ్రత్తగా భద్రపరిచేటప్పుడు చాలామంది ఎక్కువగా నాప్తలిన్ బాల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే రసాయనాల వల్ల చీరను పాడు చేస్తాయి.
ఏదైనా చీర పైన మరకలు పడితే నిమ్మరసం లేదా వెనిగర్ తో రుద్దడం వల్ల మరకలు పోతాయట. ఇలాంటి చిట్కాలను పాటిస్తే చీర ఎక్కువ కాలం పాటు అందంగా కనిపిస్తుందట.