
జీవితంలో ప్రేమ కోసం పోరాడింది .. 15 ఏళ్లలో ఒకే ఒక్క సినిమా.. కానీ చివరకు..?
తెరపై ప్రతి పాత్రలను తన ఆత్మను మనసును అంకితం చేసి నటించేది మీనా కుమారి .. కానీ జీవితాంతం ప్రేమ కోసమే పోరాడింది . కానీ మీనా కుమారి తనకంటే 37 సంవత్సరాల పెద్దవాడైన నిర్మాత కమల్ అమ్రోహిని పెళ్లి చేసుకుంది కానీ అప్పటికి అతనికి పెళ్లయింది. కానీ పెళ్లి తర్వాత ఆమె జీవితంలో దుఃఖం ఆవేదన తప్ప ఏమి కనిపించలేదు .. ఇక మీనా కుమారి నటించిన ఐకానిక్ సినిమా ‘పకీజా’ను .. ఈమె భర్త కమల్ అమ్రోహి దర్శకత్వహించారు ఈ సినిమా తీయడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలు కాదు దాదాపు 15 సంవత్సరాలు సమయం పట్టింది .. కమల్ అమ్రోహి , మీనా కుమారి మధ్య విభేదాలు రావటమే ‘పకీజా’ ఆలస్యానికి అసలు కారణమని మీడియా నివేదికలు చెబుతున్నాయి ..
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మీనా కుమారి కమల్ అమ్రేహి విడాకులు తీసుకుని విడిపోయారు .. ఆ తర్వాత, ఆమె ఆ దర్శకుడితో పనిచేయడానికి ఇష్టపడలేదు .. వీటితోపాటు సినిమా షూటింగ్స్ సమయంలోనే హీరోయిన్ ఆరోగ్యం సైతం క్షీణించింది .. కానీ దర్శకుడు నుంచి అనేక అభ్యర్థనల తర్వాత ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అలా ‘పకీజా’ రిలీజ్ అయిన రెండు నెలలకే మీనా మరణించారు .. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో వడిదుడుకులను, అవమానాలను మర్చిపోవడానికి ఆమె మద్యానికి బానిసయింది .. దాంతో ఆరోగ్యం బాగా పాడైపోయింది పకీజా సినిమా రిలీజ్ అని రెండు నెలలకి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది 1972లో రిలీజ్ అయిన పకీజా మీన కుమారి చివరి సినిమా .