జూనియర్ అనుమతి కోసం ఆశతో త్రివిక్రమ్ !

Seetha Sailaja
దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘అరవింద సమేత’ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టడానికి త్రివిక్రమ్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నాడు. రాబోతున్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ టీజర్ ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేయడమే కాకుండా ఈ టీజర్ ఎడిటింగ్ కూడ పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే జూనియర్ ఇంకా ఈ టీజర్ ను చూడలేదని చూసిన తరువాత ఈ టీజర్ కు జూనియర్ సలహాతో మార్పులు చేర్పులు చేసే అవకాసం ఉందని అంటున్నారు. ఈలోగా ఈ టీజర్ ఎక్కడా లీక్ కాకుండా త్రివిక్రమ్ చాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఎవరైనా ఈటీజర్ ను చూడాలి అనిపిస్తే త్రివిక్రమ్ తన ఎడిటింగ్ రూమ్ కు పిలిపించి చూపెడుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే అక్టోబర్ 11 రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ఈమూవీ పాటల చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదని తెలుస్తోంది. దీనితో ఈసినిమాలోని 6 పాటలకు సంబంధించి చిత్రీకరణ పూర్తి చేయాలి అంటే కనీసం పాటకు నాలుగు రోజులు చొప్పున 24 రోజులు పట్టే అవకాసం ఉంది. 

ఇలాంటి పరిస్థుతులలో అత్యంత వేగంగా ఈసినిమా పాటల చిత్రీకరణతో పాటు ఈసినిమాకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ పూర్తి చేయడానికి త్రివిక్రమ్ కు ఇంకా 30 రోజుల సమయం కావాలి అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో వేగం పెంచిన త్రివిక్రమ్ ఏమైనా ఈమూవీ ఎడిటింగ్ మరియు చిత్రీకరణ విషయంలో తప్పటడుగులు వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఇప్పుడు ఇదే టెన్షన్ త్రివిక్రమ్ జూనియర్ లను వెంటాడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: