గీతగోవిందం వ్యూహంలో మార్పులు ముందుగానే సీన్లు !

Seetha Sailaja
ఈనెల విడుదలకాబోతున్న విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ విడుదల వ్యూహాలలో మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా విడుదల అవుతున్నది ఈనెల 15ననే అయినా    దానికి పదిరోజులు ముందుగానే కొంత సినిమాను ప్రేక్షకులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇలా కొంతసినిమా ముందుగా జనం చూడటం వల్ల సినిమాలో ఇంకా ఏమి ఉందో అన్న ఆతృత ప్రేక్షకులలో పెంచడానికి ఇలాటి కొత్త వ్యూహం అల్లు కాంపౌండ్ రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘గీత గోవిందం’ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. అయితే చాలా సీన్స్ ను ఈ సినిమా నుంచి సెన్సార్ తొలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈ సినిమాలో ఏముంది అన్న సందేహాలు కొందరికి కలుగు తున్నాయి. దీనితో  ఈసినిమాను అర్జున్ రెడ్డికి సీక్వెల్ అన్నట్లు ప్రజెంట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా స్టిల్స్ కూడ ప్రత్యేకంగా తీయించి ‘అర్జున్ రెడ్డి’ మ్యానియా గుర్తుకు చేసే విధంగా వదులుతున్నారు. 

ఈపరిస్థితులలో ‘గీతగోవిందం’ లో సెన్సార్ సమస్య కారణంగా డిలీట్ అయిన సీన్లను ఈనెల 6న యూట్యూబ్ లోకి వదిలి వేసే అద్భుతమైన ఐడియా ఈ సినిమా నిర్మాతలకు వచ్చినట్లు  సమాచారం. అయితే ఇలాంటి పనుల వల్ల సినిమా మీద నెగిటివ్ ఒపీనియన్ డెవలప్ అవుతుందని కొందరు అల్లు కాంపౌండ్ కు సలహాలు ఇస్తున్నా నెగిటివ్ ఒపీనియన్ ఉన్న సినిమాలకే భారీ ఓపెనింగ్స్ వస్తున్న నేపధ్యంలో ముందుగా వచ్చిన నెగిటివ్ ఒపీనియన్ ను ఆతరువాత ప్రేక్షకుల నుండి పోజిటీవ్ ఒపీనియన్ గా మార్చుకునే సరికొత్త వ్యూహాలలో అల్లు కాంపౌండ్ ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: