నిజమైన సమంత జోస్యం !

Seetha Sailaja
‘RX 100' తరువాత విడుదలైన సినిమాలు అన్నీ ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ అత్యంత నిరాశలో ఉంది. ఈపరిస్థితి కొన్ని వారాలుగా కొనసాగుతూ ఉండటంతో ఈ పరిస్థితికి బ్రేక్ ఇచ్చే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే ఒకేసారి రెండు చిన్న సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ రెండు చిన్న సినిమాలలో ఏది చిట్ట చివరకు రియల్ హిట్ గా మారుతుంది అన్న విషయమై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

నాగార్జున మేనల్లుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న హిట్ ‘చి.ల.సౌ’ ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమా నచ్చడంతో సమంత ఈమూవీని నాగార్జున నాగచైతన్యలు ప్రమోట్ చేసేలా ఒప్పించడమే కాకుండా ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదల చేయించి ఈమూవీకి కర్త కర్మ క్రియగా సమంత హడావిడి చేసింది. 

అనూహ్యంగా ఈమూవీతో పోటీగా వచ్చిన అడవి శేషు ‘గూఢచారి’ కూడ అనూహ్య విజయం సాధించడంతో పాటు ఈమూవీలో నాగార్జున మేనకోడలు సుప్రియ ఒక కీలక పాత్రలో నటించడంతో ఒకేసారి విడుదలైన అక్కినేని కుటుంబ నటుల సినిమాలు రెండు హిట్ టాక్ తెచ్చుకోవడంతో అక్కినేని కాంపౌండ్ మంచి జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈరెండూ సినిమాల జానర్లు పూర్తిగా వేరు అయినా ఈ రెండు సినిమాలకు సరిసమానంగా నిన్నటి మార్నింగ్ షో నుంచే మంచి టాక్ రావడంతోపాటు మంచి రివ్యూస్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల సందడి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. 'గూఢచారి' ఇప్పటివరకూ తెలుగులో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ లలో పూర్తి మోడరన్ టచ్ ఉంటే ‘చి.ల.సౌ’ క్లీన్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. దీనితో సమంత జోస్యం నిజమై ఆమె సలహాతో మరిన్ని చిన్న సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: