అతడి పాటకు శంకర్ మహదేవన్ ఫిదా!

Edari Rama Krishna
ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎంతో మంది కళాకారులు అద్భుతమైన అవకాశాలు దక్కించుకుంటున్నారు. కళ అనేది ఎవరి సొంత కాదని..ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమలోని అద్భుతమైన కళను దాచి ఉంచారని సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలతో వైరల్ అవుతున్నాయి.  రీసెంట్ గా ఓ వివాహ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో గోవింద డ్యాన్స్ తో అందరి మనసు దోచారు సంజీవ్ శ్రీ వాస్తవ్ అయన్నే అందరూ ముద్దుగా డ్యాన్సింగ్ అంకుల్ అంటున్నారు.

ఒక్క వీడియో తో ఎంతగా పాపులర్ అయ్యారంటే..ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం డ్యాన్సింగ్ అంకుల్ కి ఫిదా అయ్యారు.  తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంది. కాకపోతే ఈ సారి డ్యాన్స్ తో కాదు అద్భుతమైన పాటతో..అవును కేరళకు చెందిన ఓ వ్యక్తి తాను పాడిన పాటతో ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్ హృదయాన్ని కొల్లగొట్టడమే కాదు నెటిజన్ల మనసు కూడా దోచారు. 

ఇంటర్నెట్లో అతడు పాట పాడుతున్న వీడియో చూసి ఫిదా అయిపోయిన శంకర్ మహదేవన్...అతడి ఆచూకీ తెలుపాలంటూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆ పోస్టుతో ఆ వ్యక్తి ఎవరు అని గాలించడం మొదలు పెట్టిన అభిమానులు... ఆ పాటగాడిని కూలి పని చేస్తూ జీవించే రాకేష్ ఉన్నిగా గుర్తించారు. అంతే కాదు సంగీత దర్శకుడు గోపీ సుందర్ నుండి కూడా రాకేష్ ఉన్నికి పిలుపు వచ్చింది. 

కాగా తాను ఏదో కాకతాలికంగా పాడిన పాటకు ఇంత మంచి గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని రాకేష్ అంటున్నాడు.  ఇక రాకేష్ వాయిస్ చాలా బావుందని, అద్బుతమైన ఫ్యూచర్ ఉంటుందని చెప్పారని, శంకర్ మహదేవన్ లాంటి వ్యక్తులతో కలిసి పాడే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
This is called fruit of labour!
When we hear this, it just makes me feel so so proud of our country that produces so much talent and is so rich in culture. Who is this guy???
How can I trace him?
Need help & would like to work with him. pic.twitter.com/SWqGQkmChb

— Shankar Mahadevan (@Shankar_Live) June 30, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: