తమన్నా ‘క్విన్’ కాదు..‘దటీజ్ మహాలక్ష్మి’!

Edari Rama Krishna
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ను దక్షిణాది భాషల్లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి తెరకెక్కుతోంది.  కాగా, తెలుగు వెర్షన్ కి ‘దటీజ్ మహాలక్ష్మి’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని టైటిల్ రోల్ పోషిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పింది. గతంలో విడుదలైన ‘100% లవ్ చిత్రం’లో మహాలక్ష్మి పాత్రలో తాను నటించిన విషయాన్ని గుర్తుచేసుకుంది.

ఇప్పుడు, ఇదే పేరును ఈ చిత్రానికి పెట్టడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది.‘100% లవ్’ చిత్రంలో తమన్నా పాత్ర పేరు మహాలక్ష్మి. తన గొప్పను చెప్పుకున్నప్పుడల్లా ‘దటీజ్ మహాలక్ష్మి’ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగును తాను హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాకు టైటిల్‌గా పెట్టడం ఆనందంగా ఉందని తమన్నా చెప్పారు.

తెలుగు వర్షన్‌లో తమన్నాతో పాటు సిద్దు జొన్నలగడ్డ, జి.వి.ఎల్.నరసింహరావు, మాస్టర్ సంపత్ నటిస్తున్నారు. ఈ నాలుగు వర్షన్లను మెడియంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మైసూర్‌లో శరవేగంగా జరుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: