బన్నీకి శాపంగా మారిన పవన్ వ్యూహాలు !

Seetha Sailaja
అల్లుఅర్జున్ సినిమాలకు డివైడ్ టాక్‌ వచ్చినా తట్టుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలలో మంచి పేరు ఉంది. ‘నా పేరు సూర్య’ విషయంలో అలా జరిగే పరిస్థితి కనిపించక పోవడంతో రోజురోజుకు తగ్గుతున్న ఈమూవీ కలక్షన్స్ ను చూసి  బయ్యర్లు తమకు నష్టాలు తప్పవని అభిప్రాయంలోకి వచ్చేశారు. ఈపరిస్థితి ‘సూర్య’కు రావడం వెనుక పవన్ వ్యూహమే కారణం అనిఅంటున్నారు. 

‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేసిన తరువాత పవన్ బన్నీల అభిమానుల మధ్య విపరీతమైన దూరంపెరిగింది. దీనికితోడు చిరంజీవి ‘ప్రజారాజ్యం’ వైఫల్యం తరువాత పవన్ అల్లు అరవింద్ అదేవిధంగా బన్నీల మధ్య ఏర్పడిన గ్యాప్ పై అనేక గాస్పిప్పులు వచ్చాయి. దీనితో ఈవిషయాలు అన్నింటికీ చెక్ పెట్టాలని అల్లుఅర్జున్ తనంతట తానుగా ఫిలిం చాంబర్ వద్ద హడావిడి చేస్తున్న పవన్ ను కలిసి సంఘీభావం ప్రకటించడమే కాకుండా ఆతరువాత పవన్ ను కౌగలించుకుని తమ విద్య విభేదాలు లేవు అన్న విషయమై క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించాడు.  

అయితే ఈవిషయం ప్లస్ అవుతుందని అల్లుఅర్జున్ భావిస్తే అది మైనస్ అయిందని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని ప్రముఖ ఛానల్స్ ను టార్గెట్ చేస్తూ పవన్ ఇచ్చిన పిలుపుతో ఆవేడి ముందుగా అల్లుఅర్జున్ కు చుట్టుకుంది అని అంటున్నారు. వాస్తవానికి పవన్ ఏప్రముఖ ఛానల్స్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసాడో వాటికి కూడ ‘సూర్య’ మూవీ ప్రకటనలు ఇచ్చారు. అయితే ఆప్రముఖ ఛానల్స్ అన్నీ ప్రకటనలు తీసుకున్నాయి కానీ ‘సూర్య’ పై ఎటువంటి ప్రచారం చేయకుండా మౌనం వహించాయి. 

నెగిటివ్ కామెంట్స్ చేయకుండా అదేవిధంగా పాజిటివ్ కామెంట్స్ చేయకుండా ఈప్రముఖ ఛానల్స్ అనుసరించిన వ్యూహంతో పబ్లిసిటీ పై భారీస్థాయిలో ఖర్చు జరిగినా ‘సూర్య’ కు సరైన ప్రచారం రాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో పవన్ చేసిన కామెంట్స్ కు ఎటువంటి సమాధానం ఇవ్వలేని ఆప్రముఖ ఛానల్స్ ఇన్ డైరెక్ట్ గా తమకు పవన్ పై ఉన్నకోపాన్ని అల్లుఅర్జున్ పై తీర్చుకోవడంతో పాటు ఈమూవీ సాధారణ ప్రేక్షకులకు ఏమాత్రం రుచించని నేపధ్యంలో బన్నీ కెరియర్ లో ‘నాపేరు సూర్య’ భారీ ఫ్లాప్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ విశ్లేషకుల అభిప్రాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: