షాకింగ్ ఆలస్యంగా స్పందించిన సమంత !

Seetha Sailaja
తెలుగు ఫిలిం ఇండస్ట్రీని గత కొంతకాలంగా ఒక కుదుపు కుదిపిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై సమంత చాల ఆలస్యంగా స్పందించింది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రపంచమంతా ఈ సమస్య ఉంది అని చాలామంది చెపుతున్న నేపధ్యంలో ఈవిషయమై చాలాకాలం మౌనంగా ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ శ్రీరెడ్డి వ్యవహారం తరువాత ఏర్పడిన కొన్ని అనూహ్య పరిణామాల తరువాత క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. 
 
ఇప్పుడిప్పుడే ఈవ్యాహారం పై టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా స్పందిస్తున్న నేపధ్యంలో అక్కినేని కుటుంబ కోడలు సమంత కూడ ఈవిషయమై ఓపెన్ అయి తన మనసులో మాటలు బయటపెట్టింది. తాజాగా అక్కినేని వారి కోడలు సమంత  సైతం ఈ అంశంపై ఓపెన్ అయింది. ప్రపంచంలో ప్రతి రంగంలోనూ కొందరు చెడ్డ వ్యక్తులు ఉంటారనీ అందువల్ల ప్రతి రంగాన్ని ద్వేషించుకుంటూ అన్ని రంగాలను దూరం చేసుకుంటే ఎవరికైనా ఎక్కడా పనిచేయలేని పరిస్థుతులు ఏర్పడతాయి అంటూ సమంత వ్యూహాత్మక కామెంట్స్ చేసింది. 

తనకు తొలి సినిమాతోనే పెద్ద విజయం రావడంతో తనకు ఎక్కడా ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదు అన్న విషయాన్ని తెలియ చేస్తూ తనకు గత ఎనిమిదేళ్లగా తెలుగు తమిళ పరిశ్రమలో ఎక్కడా ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదు అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది సమంత. సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి విషయాలు ఉంటాయని అదేవిధంగా మరెందరో మంచి వ్యక్తులు ఉంటారని అంటూ కేవలం నెగిటివ్ ను మాత్రమే చూస్తూ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే అది ఇండస్ట్రీకి చేసిన అన్యాయమే అవుతుందని అంటూ ఈవ్యవాహారం పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి చురకలు అంటించింది ఈ అక్కినేని వారి కోడలు. 

తనకు ఇండస్ట్రీ పట్ల ఉన్న అభిమానాన్ని మరింతగా వివరిస్తూ తనకు ఒక బిడ్డ పుట్టిన తరువాత కూడ తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతాను అని చెపుతూ సినీ పరిశ్రమలోని అమ్మాయిల కోసం ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడాన్ని 
తాను స్వాగతిస్తున్నాను అంటూ ఇండస్ట్రీలోని సమస్యలు పట్ల ఎవరూ ఖంగారు పడవలసిన అవసరం లేదు అంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది. అయితే ఇప్పుడిప్పుడే జనం మరచిపోతున్న ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై ఇంత ఆలస్యంగా ఎందుకు సమంత స్పంధించింది అన్న విషయం సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: