సినీ వారసత్వం ఉంటే సరిపోదూ..అదృష్టం ఉండాలి!

siri Madhukar
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వారసత్వపు హీరోలు ఎంతో మంది వస్తున్నారు.  ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా..శోభన్ బాబు తర్వాత అస్థాయిలో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా పేరు తెచ్చుకున్న ఫ్యామిలీ హీరో జగపతి బాబు.  ఇండస్ట్రీలో జగపతి ఆర్ట్స్ అధినేత తనయుడైన్ జగపతిబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు...అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించినా..గాయం సినిమా ఒక్కటే మనోడికి మంచి పేరు తెచ్చింది. 

ఇక లాభం లేదనుకొని బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’సినిమాతో విలన్ గా యూటర్న్ తీసుకున్నాడు. అప్పటి నుంచి అదృష్టం భలే కలిసి వచ్చింది. వరుసగా విలన్ గా నటిస్తున్న జగపతిబాబు కి తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలతో పాటు రీసెంట్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతి బాబు సినిమా కుటుంబం నుంచి వచ్చినా, తనకూ కష్టాలు తప్పలేదని అన్నారు.

సినిమాల్లో వారసత్వం ఒక్కటే సరిపోదనీ, అదృష్టం కూడా ఉండాలని చెబుతున్నారు. గతంలో కన్నా ఇప్పుడు డబ్బు విలువ బాగా తెలిసిందంటున్న జగపతిబాబు డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా, అవకాశాల కోసం అడిగే అలవాటు లేదనీ చెబుతున్నారు.  అంతే కాదు అప్పట్లో తనపై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయని..తాను వ్యసనాలకు డబ్బు ఖర్చు చేసినట్లు ఏవేవో అనుకున్నారని కానీ అదృష్టం ఎప్పటికైనా ఒక టైమ్ లో కలిసి వస్తుందని..అప్పుడే మనమేంటో నిరూపించుకోవాలని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: