కన్-ఫర్ముడ్? చార్మీకి డ్రగ్స్ అలవాటు జాస్తీనా?





గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్న సామెత గుర్తుకువస్తుంది చార్మీ తీరు చూస్తే. విచారణకు హాజరైతే తప్పేమిటి? తాను ఆ నేఱం చేయక పోతే క్లీన్ చిట్ దొరుకుతుంది కదా?  నటీనటులకు గుళ్ళు గోపురాలు కట్తించి పూజించే దురావస్థతో మన సమాజం కుళ్ళి కృశించుతుంది. ఈ విషయం లో న్యాయస్థానాన్ని ఆశ్రయించటమంటే విచారణకు సహకరించి తన తప్పులేదని నిరూపించుకునే అవకాశం వదిలేసి డొంకదారులు వెదకడమే అంటున్నారు విఙ్జులు.


అత్యంత ఉత్కంఠగా సస్పెన్స్ సినిమాలా రకరకాల మలుపుల ప్రవాహం లాగా సాగుతున్న డ్రగ్స్ కేసు విచారణను మరో కొత్త మలుపు తిప్పింది నటి  ఛార్మి. విచారణ జరిగే తీరు తనకు నచ్చడం లేదంటూ, చట్టానికి విరుద్ధంగా రక్త నమూనాలు, పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది ఛార్మి. 


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) కింద విచారణ పేరుతో పరీక్షల కోసం బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్లు వంటివి తీసుకోవడం చట్టవిరుద్ధమని ఛార్మి తన పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా తనను మహిళా అధికారులు విచారించాలని, విచారణ సమయంలో తన లాయర్ కూడా పక్కనే ఉండాలని, తన రక్త నమూనాను సేకరించకూడదని ఆమె కోర్టును ఆశ్రయించింది.



 
ఇప్పటివరకు విచారణకు హాజరైన పూరీజగన్నాథ్, తరుణ్, నవదీప్ లాంటి సినీ ప్రముఖులెవరూ రక్త నమూనా సేకరణకు అభ్యంతరం చెప్పలేదు. తాము ఇష్టపూర్వకంగానే ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఛార్మి ఇలా కోర్టుకెక్కడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినీ ప్రముఖుల్లో డ్రగ్స్ వినియోగిస్తున్న వాళ్ల జాబితాలో ప్రధానంగా ఛార్మి పేరు వినిపిస్తుండ డంతోనే రక్త నమూనాను ఇవ్వడానికి ఆమె నిరాకరరణ ఆమె నిజంగానే డ్రగ్స్ వినియోగిస్తుందా? అనే పలు అనుమానాలు పదుగురు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానానింకి అవకాశం చార్మీ తనకు తానే ప్రజలకు కలిగించింది. 


 
ఛార్మి కోర్టులో పిటిషన్ వేసిన అనంతరం సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న అకున్ సబర్వాల్ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తాము చట్ట ప్రకారమే విచారణ చేస్తున్నామని, విచారణను వీడియో తీసి సీడిలో పొందుపరుస్తున్నా మని, రక్త నమూనాలను కూడా సదరు వ్యక్తుల అంగీకారం మేరకే సేకరిస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఎవరైనా రక్త పరీక్షకు అభ్యంతరం చెబితే రిపోర్టులో ఆ విషయాన్ని పొందుపరచి కోర్టుకు సమర్పిస్తామని, తదనంతరం కోర్టు నిర్ణయం మేరకు నడుచు కుంటామని ఆయన స్పష్టం చేశారు.  ఇప్పుడు ఎంచెపుతుంది చార్మీ? సినీ సెలబ్రిటీల ఈ ప్రవర్తన ప్రభావం సాధారణ ప్రేక్షకులపై తప్పక ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: