ప్రపంచ వ్యాప్తంగా సంచలన రికార్డులు సృష్టిస్తున్న చిత్రం ‘బాహుబలి 2’. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ భారత దేశ సినిమా చరిత్రలో అత్యధిక 1000 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ రికార్డు కొట్టాలంటే ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడు కూడా ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే బాహుబలి చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. అంతే కాదు ఇందులో నటీ, నటులకు జాతీయ స్థాయిలో మంచి గౌరవం దక్కింది.
ముఖ్యంగా బాహుబలిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాదు మనోడితో సినిమాలు, యాడ్స్ తీయాలని కార్పోరేట్ సంస్థలు క్యూ కట్టారు. తాజాగా ప్రభాస్ ఓ చిన్నారిని చేతిలో ఎత్తుకొని ఉన్న ఫోటో వైరల్ అయ్యింది. అయితే ఈ ఫోటో పై రక రకాల కామెంట్స్ వినిపించాయి..ప్రభాస్ బంధువుల కూతురు అని..పాప అచ్చం ప్రభాస్ లా ఉందని..ఇలా ఇష్టమొచ్చిన తీరుగా కామెంట్స్ పెట్టారు నెటిజన్లు.
అసలు విషయానికి వస్తే..ఆ పాప ఎవరో కాదు..బాహుబలి చిత్రంలో శివగామి (రమ్యకృష్ణ) తన చేతిలో ఎత్తుకొని ఉన్న చిన్నారి. అయితే సినిమాలో చిన్నప్పటి బాహుబలి పాత్ర అంటే అబ్బాయి పాత్ర కానీ ఆ పాత్ర పోషించింది ఓ అమ్మాయి గుర్తుంది కదా.. ఆ అమ్మాయే ప్రభాస్ ఎత్తుకున్న ఈ అమ్మాయి. అప్పట్లో బాహుబలి షూటింగ్ కోసం ఈ చిన్నారి ని ఎంపిక చేసారు.
అయితే బాహుబలి మొదట్లో చిన్నారి పాప గా ఉన్న ఈ అమ్మాయి కి అప్పుడే అయిదేళ్ళు వచ్చేసాయి ఎందుకంటే బాహుబలి రెండు పార్ట్ లు కలిపి దాదాపు అయిదేళ్ళ కష్టపడి తెరకెక్కించారు. అయితే శివుడి పాత్రలో కనిపించే ఆ చిన్నారి..తన చిన్నప్పటి పాత్ర పోషించిన అమ్మాయిని ఎత్తుకొని ముద్దు చేస్తున్న ప్రభాస్ - అక్షిత ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.