జక్కన చెక్కిన శిల్పం నాభిలో చిరుకప్పే ఉండగా - బాహుబలి లోని చిన్న లోపాలని వదిలేద్దాం ?



వందల కోట్లు వెచ్చించి అతి భారీ ఎత్తున తీసిన సినిమా, అదీ జక్కన్న చెక్కిన శిల్పం లో భాషా  దోషం ఉండటం "అందంగా ముస్తాబైన తెలుగమ్మాయి నుదుట కుంకుమ సింగారించు కోకపోతే" ఎలా ఉంటుందో అలా ఉంటుంది.


"అమర శిల్పి సినిమా ప్రకారం - జక్కన చెక్కిన ఒక శిల్పంలో లోపం ఉన్నదని డంకన అనే మరో శిల్పి గుర్తిస్తాడు. కోపగించిన జక్కన్న లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటానని, ప్రతిజ్ఞ చేస్తాడు. పరీక్షించిన తరువాత ఆ శిల్పంలోని లోపం ఉందని నిరూపించ బడుతుంది. ప్రతిజ్ఞా పాలన కోసం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు. ఆ సమయంలోనే వీరిద్దరు తండ్రీ కొడుకులని గుర్తిస్తారు. డంకన తండ్రిని మించిన తనయునిగా ప్రసిద్ధి పొందుతాడు"




కొందరు గొప్పవాళ్ళుగా అనితర సాధ్యులుగా ఎందుకు పిలవ బడతారంటే వారిలోని క్రమశిక్షణ, ప్రవర్తన, గుణాత్మకత. ఈ మంచి గుణాలన్నీ ఉండి శిల్పంలా సినిమాని ఏళ్ళు పూళ్ళు చెక్కే రాజమౌళి నుంచి తప్పులు ఆశించలేము.


ట్రైలర్ ఒక అద్భుతం. అద్భుత విందులో, మధురాహారాలతో మృష్టాన్న బోజనం ఆరగించేటప్పుడు పంటి కింద రాయి తగిలితే?  ఎలా?  ఉంటుందో అలా అనిపిస్తే ఆ వర్ణనాతీతమైన దృశ్య ప్రవాహం పరుగులు ఒక్క క్షణ మాత్రం ఆపినా! భరించగలమా?




మధ్యలో ఒక్కసారిగా అంతరాయం సహించలేముకదా! అది భాష తెలిసిన వారికి కదా? వారు ఎందరు ఉంటా రని అనుకుంటే మీ ఇష్టం. 


ఇంతకీ అందరో?  కొందరో ?  లేవనెత్తుతున్న అసలు భాషా దోషమేమంటే ట్రైలర్ లో కట్టప్పతో బాహుబలి చెప్పే డైలాగ్ ఒకటుంది. అందులో..

"నువ్వు నా పక్కన ఉన్నంత వరకు..నన్ను చంపే మగాడు ఇంకా పుట్ట లేదు మామా!"  అని. ఈ డైలాగ్ లో ఒక భయంకరమైన వ్యాకరణ దోషం ఉందన్నది - భాషాభిమానుల వేదన.




చెప్పేదేమంటే.. "నువ్వు నా పక్కన ఉన్నంతవరకు"  అన్నది వర్తమానమైతే, " చంపే మగాడు పుట్టలేదు మామ!"  అనేది గడిచి పోయిన భూతకాలం అవుతుందని.. వాస్తవానికి డైలాగ్ ఉండాల్సింది.


నన్ను చంపే మగాడు పుట్టబోడు మామ అని ఉండాలని.. ఇలాంటి తప్పుల్ని పట్టించుకోకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వ్యాకరణం పరంగా తప్పు అయినప్పటికీ,  మరీ ఈకలు పీకుతున్నట్లుగా ఉందన్న చురకలు పడుతున్నాయి. మరికొందరు, నిజమే కదా!  అంటూ రియాక్ట్ అవుతుండటం గమనార్హం.

 

కోటాను కోట్లు గ్రాఫిక్సుకు, క్లైమాక్సుకు ఖర్చు పెట్టే జక్కన మాతృభాష లో వ్యాకరణం తెలియని వాళ్ళని సంభాషణా రచయిత లుగా ఎలా పెట్టుకున్నారనేదే? వారి వ్యధా పూరిత వాదన.


అనేక సినిమాల్లో   "వాళ్ళు" కు బదులు "వాల్లు" - "వీళ్ళ" కు బదులు "వీల్లు"  అనే గొప్ప కథానాయకులను చూస్తూనే ఉన్నా వారిపై అంత వత్తిడి ఉండదు కారణం వారికి సరుకు లేదని అందరికి తెలుసు. ముద్దపప్పు వెధవలు అని విమర్శకూ అనర్హుల ని వదిలి వేస్తాం.


కాని క్వాలిటీకే లైఫ్ ఇచ్చే జక్కన్న ఇలా చేశాడు ఏమిటబ్బా? అనుకోవటం సహజం. ఈ వ్యాఖ్య కోడిగుడ్డు పై ఈకలు వెదకటం కాదని మనవి.   




మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వబౌముడు నందమూరి తారక రామారావు గారి వాగ్ధాటి అందరికీ తెలుసు భాషా జ్ఞానం కడుంగడు మెండు. అయినా ఆయన సంభాషణ ల్లో వాగ్దోషం ఉంది. అదేమంటే "కృతజ్ఞత" అని ఆయన పలకలేరు. పాండవ వనవాసంలో ఒక విమర్శకుడు దాన్ని ఎత్తి చూపినప్పుడు ఆయనేమన్నారో తెలుసా! "క్షమించండి, అది నా గొంతులో ఉన్న ఉచ్చారణా దోషం. ప్రయత్నించి కూడా సరి చేసుకో లేక పోతున్నాను"  అని.


రచయితలు మరో పదం దానికి బదులు వాడదామన్నా ఆయన అంగీకరించలేదు. కాని ఆయన "కృతజ్ఞతకు బదులు కృతఘ్నత" అన్నా 'భాషే కాదు భావం మారినా' వ్యతిరెఖత స్పురించినా - తన నటనా చాతుర్యంతో ప్రెక్షకులు, విమర్శకులు పట్టించుకోనంతగా మెప్పించారు.

జస్ట్ - ఒక విషయం చెపుదామని మాత్రమే. విమర్శకు మాత్రం కాదని మనవి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: