తమన్నా : కెవ్వు కేక

Prasad
తమిళ, తెలుగు రంగాల్లో తన అందాల సత్తా చూపిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లోనూ సెగలు పుట్టించడానికి సిద్ధ పడుతుంది. తమన్నా, అజయ్ దేవగణ్ లు జంటగా రూపొందుతున్న హిమత్ వాలా సినిమా పొస్టర్స్ ను ఇటీవల విడుదల చేశారు. వీటిలో తమన్నా అదరహో అనే రేంజ్ లో ఉంది. గతంలో తమన్నా ‘చంద్ సా రోషన్ చెహ్ర’ అనే హిందీ సినిమాతో తొలిసారిగా తెర మీదకు వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన గుర్తింపు తీసుకురాలేదు. తరువాత తమిళ, తెలుగు సినిమాల్లో రాణించింది. ఇప్పుడు మళ్లీ హిమత్ వాలా సినిమాతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన హిమత్ వాలా పోస్టర్స్ తో తమన్నా బాలీవుడ్ జనాన్నికెవ్వు కేక అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: