తగ్గించుకుందా.. తగ్గించారా..?

Prasad
అందాల భామ శ్రియ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొత్త అందాలు రావడంతో శ్రియ బాగా వెనుకబడి పోయింది. కాగా, శ్రియ ప్రస్తుతం చంద్ర అనే సినిమాలో నటిస్తుంది. రూపా అయ్యార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రియ రాజకుమారిగా నటిస్తుంది. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ సినిమా చాలా బాగావస్తుందని, రాజకుమారి పాత్ర తనకు బాగా నచ్చిందని అందుకే ఈ సినిమాకు తన పారితోషకాన్ని సగానికి తగ్గించుకున్నాని చెప్పింది. దీంతో శ్రియ మాటలపై ఫిల్మ్ నగర్ లో అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. పారితోషకం తగ్గించుకోవడం వంటి మాటలను అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు చెబితే బాగుంటుందని, సినిమా చాన్సులు తగ్గినప్పుడు, పారితోషకం తగ్గించుకున్నాంటే నమ్మరని, కాబట్టి పారితోషకం తగ్గించారని చెబితే బావుంటుందని ఫిల్మ్ నగర్ జనాలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: