అనుష్క అసహనం

Chowdary Sirisha
అనుష్క చిత్తూరు జిల్లాలోని ఓ ఆలయానికి వెళ్లింది. ఆమె రాకతో సంబంధం లేకుండా నటుడు నాగ చైతన్య కూడా అదే ఆలయానికి వెళ్లి పూజలు చేసుకుని వచ్చాడు. నిజానికి ఈ ఇద్దరూ వేర్వేరుగా ఆ ఆలయానికి వెళ్లారు. కానీ, మీడియాలో కథనాలు ఇద్దరూ కలసి వెళ్లారనీ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం మరింత పెరుగుతోందని ఎన్నో రకాలుగా వచ్చాయి.  ఈ వార్తలన్నీ చూసి అనుష్క మనస్తాపానికి గురైంది. "అందరూ మనశ్శాంతి కోసం గుడికి వెళతారు. కానీ, నేను ఈ గుడికి వెళ్లిన దగ్గర్నుంచీ ప్రశాంతత కరువైపోయింది. బయటికి వెళ్తే చాలు అందరూ దీని గురించే అడుగుతున్నారు. చాలా చిరాగ్గా ఉంటోంది" అని సన్నిహితులతో వాపోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: