అల్లరి నరేష్‌కు ఏమైందీ

Devi Priya
 టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేష్ స్పీడ్ తగ్గించాడు. ఏడాదికి అరడజన్ సినిమాలు ఈజీగా చేస్తూ కమర్షియల్ మార్కెట్ కలిగిన అల్లరి నరేష్ ఇప్పుడు బద్దకిస్తున్నాడు. మార్నింగ్ షూటింగ్‌లకైతే నో అంటున్నాడు. మధ్యాహ్నం అయితేనే షూటింగ్‌కు వస్తున్నాడట. దీనివల్ల ఇతర నటీనటుల డేట్స్‌ గందరగోళంలో పడుతున్నాయి. మరి అల్లరి నరేష్‌కు ఏమైందీ.. అని ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. ఈ మధ్యన లేట్ నైట్ పార్టీల్లో ఈ హీరోగారి 'అల్లరి' ఎక్కువైపోతోందట. ఫ్రెండ్స్ తో కలిసి తెల్లవారుజాము మూడు గంటల వరకూ ఎంజాయ్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. మన హీరోగారికి రాత్రుళ్లు బిజీ కావడంతోనే షూటింగ్స్ కు, సినిమా ప్రమోషన్‌కు రావాలంటే ఆఫ్టర్‌ లంచ్‌ మాత్రమే సాధ్యం అవుతుందని అంటున్నారు. ఇవివి సత్యనారాయణ తన తనయులకు బంగారుబాటను ఏర్పరచిపోయారు. దాన్ని కాపాడుకోవాలి. తండ్రికి వచ్చిన దాంతో కొంతైనా పేరు తెచ్చుకుంటే తిరుగుండదు. మరి మ్యారేజ్ తర్వాత అయినా తన 'అల్లరి' తగ్గిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: