బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటున్న యంగ్ టైగర్
ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు ‘జనతా గ్యారెజ్’ రానుందని రిలీజ్ డేట్ కూడ ఫిక్స్ కావటంతో, చిత్ర యూనిట్ రాత్రి, పగలూ అనకుండా కష్టపడుతున్నారు. ఇక ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి సినిమాలతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన దర్శకుడు కొరటాల శివ సైతం ‘జనతా గ్యారెజ్’ మూవీని సక్సెస్ దిశగా తీసుకువెళ్ళాలని చూస్తున్నాడు.
అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘జనతా గ్యారెజ్’ మూవీ అవుట్ పుట్ సూపర్భ్ గా వస్తుందని అంటున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు చాలా పూర్తయ్యాయని, కొద్దిపాటి ప్యాచ్ వర్క్ లను సైతం పూర్తి చేస్తున్నారని చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న సమాచారం.
ఇదిలా ఉంటే ‘జనతా గ్యారెజ్’ మూవీకి సంబంధించినప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే ఊపందుకుంది. బిజినెస్ ట్రేడ్ లోనూ ‘జనతా గ్యారెజ్’మూవీపై మంచి టాక్స్ ఉండటంతో, ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ ని సాధించటం ఖాయం అని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.