రాంగోపాల్ వర్మ తెగ సంతోషంలో ఉన్నాడట..!!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఈ మద్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే తన ట్విట్టర్ ద్వారా సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ లీడర్స్ ని విమర్శిస్తూ..పొగుడుతూ హాట్ టాపిగా మారాడు. తాజాగా అమీర్ ఖాన్ పై కూడా విమర్శలు గుప్పించారు. దేశంలో అసహనం పెరిగినట్లయితే ఒక నటుడిగా ఇంత ఆదరణ భారత దేశంలో వచ్చేదా అని విమర్శించారు.               

ఆ మద్య మహేష్ బాబు, పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ విషయంలో కూడా తలదూర్చారు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఒక విషయంలో తెగ సంతోషంలో ఉన్నాడట. హైదరాబాద్‌లో తన పేరిట ఓ కాక్‌టెయిల్ లాంచ్ కావడం తనకు ఈ మధ్య ఇచ్చిన కిక్ అంటూ ట్వీట్ చేశాడు.‘ఆర్జీవీ ఎక్జోటికా’ పేరుతో రెస్టారెంట్‌ని నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓపెన్ కావడంపై ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రమ్, జిన్, వోడ్కా ఈ మూడు కలిపినదే ఈ కాక్ టెయిల్! తన పేరు మీద ఇలా ఇది మొదలుకావడం హ్యాపీగా వుందంటూ ట్వీట్ చేశాడు.  ఏదైమైనా రాంగోపాల్ వర్మ సంతోషం వచ్చినా...కోపమోచ్చినా తన ట్విట్టర్ ఆయుధంగా చేసుకున్ని నెటిజన్లతో కనెక్ట్ అవుతున్నాడు.

రాంగోపాల్ వర్మ ట్విట్ : 

Out of respect or disrespect "On the Rocks" pub at Jubilee Hills launched a cocktail Rgv Elixir..Humbled and Amused pic.twitter.com/ey0LZ39skK

— Ram Gopal Varma (@RGVzoomin) November 26, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: