పురుషోత్తముడుతో రాజ్ తరుణ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Purushottham Vinay

టాలీవుడ్ హ్యాట్రిక్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా మంచి కథ దొరికితే చాలు వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ హీరో గా నటించిన చిత్రం 'పురుషోత్తముడు' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాసినీ సుధీర్‌ హీరోయిన్‌గా నటించగా ప్రకాష్‌ రాజ్‌, మురళీశర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి సీనియర్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించడం విశేషం. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్‌ పతాకంపై డా రమేష్‌ తేజావత్‌, ప్రకాష్‌ తేజావత్‌ ఈ సినిమాని నిర్మించడం జరిగింది.


ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియాలోని బడా వ్యాపారవేత్త అయిన ఆదిత్య రామ్(మురళి శర్మ) కుమారుడు రచిత్ రామ్(రాజ్ తరుణ్) లండన్ లో చదువు పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగొస్తాడు. రాగానే రచిత్ ని తన కంపెనీకి సీఈఓ చేయాలని ఆదిత్య రామ్ అనుకుంటాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం సీఈఓ కావాలంటే.. వంద రోజుల పాటు కామన్ మ్యాన్ లా అజ్ఞాత జీవితాన్ని గడపాలి అనే విషయాన్ని రచిత్ పెద్దమ్మ అయిన వసుంధర(రమ్యకృష్ణ) గుర్తు చేస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని కడియం దగ్గరలో ఉన్న రాయపులంక అనే గ్రామానికి చేరుకుంటాడు రచిత్. అక్కడ అమ్ము(హాసిని సుధీర్) తో లవ్ లో పడతాడు. అలాగే ఆ ప్రాంత ఎమ్మెల్యే కుటుంబం కారణంగా ఇబ్బంది పడుతున్న స్థానిక రైతుల తరపున పోరాటం చేస్తాడు. ఆ తరువాత ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉంటాయి.అసలు రచిత్ సీఈఓ అయ్యాడా? రైతుల కోసం అతను ఏం చేశాడు? తన ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే..


ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా పురుషోత్తముడు సినిమా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ప్రేమ సన్నివేశాలు, రైతుల ఎపిసోడ్ తో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గానే ఉంది. సెకండ్ ఆఫ్ కూడా డైరెక్టర్ బాగానే డీసెంట్ గా లాక్కొచ్చేసాడు.. ఇంకొంచెం కథనం, సీన్స్ బాగా రాసుకుంటే ఈ సినిమా ఇంకా బాగుండేది. డైలాగ్స్ పర్వాలేదు. ముఖ్యంగా చివరిలో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. కానీ ఇలాంటి కథలకి డైలాగ్స్ ఇంకా బలంగా రాసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సినిమాకి రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.

 
రామ్ పాత్రకు రాజ్ తరుణ్ అయితే పూర్తి న్యాయం చేశాడు. గ‌తం కంటే కాస్త ఇంఫ్రూవ్ అయ్యాడు. హీరోయిన్ హాసిని సుధీర్ గ్లామ‌ర్ యూత్‌ను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక సీనియ‌ర్ న‌టి రమ్యకృష్ణ కూడా త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో బాగానే ఆకట్టుకున్నారు. మిగతా నటులు త‌మ త‌మ పాత్ర‌ల్లో పర్వాలేదనిపించారు.


పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. గోపీ సుందర్ పాటలు వినసొంపుగా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బాగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది.ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తన అనుభవంతో ఉన్నంతలో సినిమాని నీట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.


మొత్తానికి రొటీన్ స్టోరీ అయినా కూడా ఈ సినిమాను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు ద‌ర్శ‌కుడు. చాలా మందికి స్ఫూర్తిగా నిలిచే సీన్లు, మాట‌లు ఈ సినిమాలో ఉన్నాయి. రాజ్ తరుణ్ గత రెండు మూడు సినిమాల కంటే ఈ సినిమా కంటెంట్ గుడ్ అనిపించింది. ముఖ్యంగా బోర్ కొట్టకుండా టైం పాస్ కోసం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు, ఫ్యామిలీతో క‌లిసి ఈ సినిమా చూడవచ్చు. ఈ సినిమా రేటింగ్ విషయానికి వస్తే 2.75/5 రేటింగ్ ఇవ్వవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: