హరోంహర రివ్యూ: వావ్! సుధీర్ మాస్ సంభవం అదుర్స్?

Purushottham Vinay
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హరోం హర. కొత్త దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్ బ్యూటీ మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది.సునీల్, జయప్రకాష్ ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను, సూపర్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా కోసం చాలా కాలంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఎట్టకేలకు ఈ మూవీ నేడు(జూన్ 14) థియేటర్స్ లోకి వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? సుధీర్ బాబు ఈ సినిమాతో ఆడియన్స్ ను మెప్పించాడా? లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.


స్టోరీ: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇంకా తమిళనాడు మూడు సరిహద్దులు కలిసే ప్రాంతం కుప్పం. అయితే ఆ ఊరును తిమ్మారెడ్డి అతని సోదరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. అదే సమయంలో పాలిటిక్నిక్ కాలేజీలో ఉద్యోగం కోసం ఆ ఊరికి వస్తాడు సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు). అయితే అనుకోకుండా ఒకవ్యక్తితో గొడవ జరిగి కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి తన స్నేహితుడైన పళని స్వామి(సునీల్)తో కలిసి తుపాకి తయారీ పనులు మొదలు పెడతాడు. ఇక అలా తుపాకి తయారీ మొదలుపెట్టిన సుబ్రహ్మణ్యం.. జీవితం తరువాత ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు అతని ఉద్యోగం పోవడానికి కారణమైన వ్యక్తితో సుబ్రహ్మణ్యం ఎందుకు చేతులు కలిపాడు? తరువాత సుబ్రహ్మణ్యం ఆ ఊరికి దేవుడు ఎలా అయ్యాడు? అనేది మిగిలిన స్టోరీ.


విశ్లేషణ:బతకు తెరువు కోసం వేరే ఊరి నుండి వచ్చే హీరో.ఇక అక్కడ లోకల్ రౌడీలతో గొడవ. వారిని అంతం చేసి ఆ ఊరికి హీరో దేవుడవడం అనే కాన్సెప్ట్ తో ఇప్పటి దాకా చాలా సినిమాలే వచ్చాయి. ఈ హరోం హర సినిమా కథ కూడా అదే. కానీ, ప్రెజెంటేషన్ మాత్రం అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి.కొత్తగా డీల్ చేశారు దర్శకుడు. అదే ఈ మూవీకి హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్, నెక్స్ట్ లెవల్ బీజీఎమ్ ఆడియన్స్ కి మంచి హై ఇవ్వడం ఖాయం. ఈ అంశాలు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ అయితే అదిరిపోయింది.


దాంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది.ఇక అక్కడి నుండి కథలో వేగం కూడా పెరుగుతుంది. ఎమోషన్స్ విషయాల్లో కొంచెం కనెక్షన్ మిస్ అయినా.. యాక్షన్ సీక్వెన్స్, BGM మాత్రం యాక్షన్ లవర్స్ కి విపరీతంగా నచ్చేస్తాయి. మొత్తంగా ఒక మంచి యాక్షన్ డ్రామా చూసిన ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది.సుధీర్ బాబు కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా సుధీర్ బాబుకి స్ట్రాంగ్ కం బ్యాక్ అనే చెప్పాలి. సినిమా అయితే వేరే లెవెల్ లో ఉంది. ఇక వసూళ్లు ఎలా వస్తాయో చూడాలి.


రేటింగ్: 4/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: