83 : రివ్యూ
1975, 79 సంవత్సరాల్లో జరిగిన వరల్డ్ కప్ లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన భారత జట్టు 1983లో ఏకంగా వరల్డ్ కప్ గెలుచుకుంటుంది. ముందునుండి ఎలాంటి అంచనాలు లేని భారత జట్టు ఈ టోర్నీ ఎలా మొదలు పెట్టింది ఎలా కొనసాగించింది.. ఎలా జట్టు విజయతీరాలకు చేరేలా చేసింది అన్నది చూపించారు.
ఇక పాత్రల విషయానికి వస్తే నేపథ్యం 83 వరల్డ్ అని తీసుకున్నా ఇది కపిల్ దేవ్ జీవిత కథ అని అనిపిస్తుని. కెప్టెన్ గా జట్టు బాధ్యత మీద వేసుకున్న ఆయన ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిన తీరుని అద్భుతంగా చూపించారు. కపిల్ దేవ్ గా నటించిన రణ్ వీర్ సింగ్ తన నటనతో మరో రెండు మెట్లు ఎక్కాడని చెప్పొచ్చు. ముఖ్యంగా నటరాజ్ షాట్ ఆడిన విధానం రణ్ వీర్ సింగ్ కాదు కపిల్ దేవ్ తెర మీద ఉన్నాడా అనిపిస్తుంది. ఇక కృష్ణమాచారిగా జీవా అలరించాడు. కపిల్ దేవ్ భార్యగా రోమి భాటియా పాత్రలో దీపికా పదుకొనె కూడా ఉన్నంత సేపు పాత్రకు అందం తీసుకొచ్చింది.
1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని అందరికీ తెలుసు.. కాని సినిమాలో మ్యాచ్ ను ఉత్కంఠత రేపేలా సన్నివేశాలు ఉన్నాయి. సరదా సన్నివేశాలు ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తే ఎమోషనల్ సీన్స్ మనసుకి హత్తుకుంటాయి. వీటిని బ్యాలెన్స్ చేయడంలో డైరక్టర్ కబీర్ ప్రతిభ చూపించాడు. సినిమాకు ఆసిం మిశ్రా సినిమాటోగ్రఫీ బాగుంది. 1983 రోజుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నేపథ్య సంగీతం కూడా అలరించింది. ఆర్ట్ డిపార్ట్ మెంట్, కాస్టూంస్ బాగా కష్టపడ్డారు.