భాగమతి: రివ్యూ

kumar siva
అనుష్క నటన, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఇంటర్వల్ అనుష్క నటన, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఇంటర్వల్ రొటీన్ కథ , క్లైమాక్స్
ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అయిన చెంచల (అనుష్క) ఓ కేసు విషయమై రిమైండ్ లో ఉండగా.. మంత్రి ఈశ్వర్ (జయరాం) గురించి సమాచారం కోసం ఆమెను ఓ పాడుపడ్డ బంగ్లాలో అన్ అఫిషియల్ ఇంటరాగేషన్ చేస్తుంటారు. అక్కడ చెంచల కొద్దిసేపు చెంచలగా మరికొద్ది సేపు భాగమతిగా ప్రవర్తిస్తుంది. అసలు భాగమతి ఎవరు.. ఆమె చెంచలతో ఎందుకు ఆడుకుంటుంది..? అసలు భాగమతి ఉందా..? అసలు చెంచల ప్లాన్ ఏంటి..? అన్నది అసలు కథ.
స్వీటీ అనుష్క మరోసారి తన నట విశ్వరూపం చూపించింది. చెంచలగా, భాగమతిగా రెండు వేరియేషన్స్ చూపించింది. కేవలం అరుంధతి వల్లే ఇలాంటి చేయడం కుదురుతుందని మరోసారి నిరూపించుకుంది. ఇక శక్తిగా ఉన్ని ముకుందన్ ఆకట్టుకున్నాడు. ఈశ్వర్ గా జయరాం సహజ నటనతో ఆకట్టుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా మురళి శర్మ.. సిబిఐ గా ఆషా శరత్ ఆకట్టుకున్నారు. 

టెక్నికల్ గా భాగమతి అన్నిటా ది బెస్ట్ అనిపించుకుంది.. మధి సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా హెల్ప్ అవగా.. తమన్ మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. ఇక సినిమా దర్శకుడు అశోక్ డైరక్షన్, స్క్రీన్ ప్లే బాగుంది. అయితే కథను మాత్రం రాజు గారి గదికి దగ్గర పోలిక ఉండేలా రాసుకున్నాడు. సినిమా అంతా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు. ఇక యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు కావాల్సిన భారీతనం తెచ్చి పెట్టింది.

భాగమతి టైటిల్ తోనే గ్రాండ్ అప్పియర్ గా వచ్చిన భాగమతి సినిమా కథ పాతదే అవగా కథనంలో డైరక్టర్ అశోక్ తన పనితనం చూపించాడు. మొదటి భాగం అంతా సస్పెన్స్ మోడ్ లో తీసుకెళ్లిన డైరక్టర్ సెకండ్ హాఫ్ కూడా అదే విధంగా ఆకట్టుకున్నాడు. బలమైన ఇంటర్వల్ బ్యాంగ్ తో సినిమాకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.

సినిమాలో మరో కల్పిత కథ అది ఆడియెన్స్ ను మిస్ గైడ్ చేసినట్టుగా అనిపించినా ఎంటర్టైన్ చేయడంతో సక్సెస్ అయ్యాడు డైరక్టర్. సినిమా ఎక్కడ గ్రాఫ్ తగ్గించకుండా టైటి స్క్రీన్ ప్లేతో నడిపించాడు. అనుష్క మీదే సినిమా మొత్తం నడిపించిన తీరు బాగుంది. అయితే క్లైమాక్స్ కాస్త నిరాశ పరచక తప్పదు.

రాజు గారి గది సినిమా లైన్ తోనే భాగమతి అంటూ ఓ కొత్త కలరింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అయితే డైరక్టర్ విషయంలో మంచి మార్కులే పడ్డాయి. ఎంచుకున్న కథకు.. కథనం కూడా అంతే చక్కగా అందించాడు. మొత్తానికి అనుష్క ఫ్యాన్స్ కు యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చేస్తుంది.
Anushka Shetty,Unni Mukundan,G. Ashok,V. Vamsi Krishna Reddy,Pramod,S. Thamanఅనుష్క 'భాగమతి' థ్రిల్ చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: