కృష్ణగాడి వీరప్రేమగాధ : రివ్యూ
15 ఏళ్ళ క్రితం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కథ మొదలుతుంది.. హిందూపూర్ లోని ఓ సిటీలో కథ జరుగుతుంది. కృష్ణ(నాని) నందమూరి బాలకృష్ణకి వీరాభిమాని, కానీ మనోడికి ఉన్న సమస్యల్లా చిన్నతనం నుంచి తను చాలా భయస్తుడు, పిరికివాడు. కానీ భయటకి మాత్రం అందరికీ పెద్ద పోటుగాడు అని బిల్డప్ ఇస్తూ తిరుగుతుంటాడు. చిన్నప్పటి నుంచే క్రిష్ణగాడు ఆ ఊరి ఫ్యాక్షన్ కింగ్ రామరాజు వారసురాలైన మహాలక్ష్మీ(మెహరీన్)తో స్నేహం ఉంటుంది, ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి 15 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ నానికి ఉన్న భయం వలన మహాలక్ష్మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. ఫైనల్ గా చెప్పాల్సిన సందర్భం వస్తుంది, చెబుదాం అని వెళ్తాడు. అప్పుడే ఓల్డ్ మాఫియా డాన్ అయినడేవిడ్ తన మదర్ చివరి కోరిక తీర్చడానికి హైదరాబాద్ వస్తాడు. అదే టైంలో రామరాజు ఇంట్లో ఎసిపి శ్రీకాంత్(సంపత్) ముగ్గురు పిల్లలు కిడ్నాప్ అవుతారు. ఇక అక్కడు నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కిడ్నాప్ కి కృష్ణకి ఉన్న సంబంధం ఏమిటి? అలాగే డాన్ డేవిడ్ మదర్ చివరి కోరిక ఏమిటి? చివరికి కృష్ణ - మహాలక్ష్మీల ప్రేమ ఏమైంది? అన్నదే మిగిలిన కథ..
నటీనటుల్లో మొదటగా హీరో నుంచి మొదలు పెడితే.. హను రాసుకున్న కథకి నానినే పర్ఫెక్ట్, అతను తప్ప ఇంకెవ్వరూ ఈ కథకి న్యాయం చేయలేరు. ఎందుకంటే తన ఎనర్జిటిక్ అండ్ నాచురల్ నటనే ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. ఎప్పటిలానే తన మార్క్ డైలాగ్ డెలివరీతో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే సెకండాఫ్ లో కనిపించే ముగ్గురు పిల్లల పెర్ఫార్మన్స్ సూపర్బ్, అలాగే వీరితో కలిసి నాని చేసిన అల్లరి బాగా నవ్విస్తుంది. ఇక హీరోయిన్ మెహరీన్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. కానీ హీరోయిన్ కి కాస్త ప్రాధాన్యత తక్కువ ఉంది. అది పక్కన పెడితే మేహరీన్ మాత్రం మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. సంపత్ రాజ్ ఎసిపి పాత్రలో మెప్పించాడు. సత్యం రాజేష్, ప్రభాస్ శీను, బ్రహ్మాజీల కామెడీ సింప్లీ సూపర్బ్, వీరి నటన, వీరి వన్ లైన్ డైలాగ్స్ భీభత్సంగా పేలాయి. రామరాజు, శత్రు, మురళి శర్మ, హరీష్ ఉత్తమన్, రవి కాలే లాంటి వారు నెగటివ్ పాత్రల్లో జీవించారు. వీరి తర్వాత చిన్న పిల్లలైన బేబీ నయన, మోక్ష, శ్రీ ప్రతంలు బాగా చేసారు.
కృష్ణగాడి వీర ప్రేమగాథ' మన తెలుగు ఎంటర్టైన్మెంట్ అనే ఫార్ములాని బేస్ చేసుకొని వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చేస్తుంది. 'ఒక భయస్తుడు తన ప్రేమ కోసం ప్రేయసిని ఎలా ఒప్పించాడు, ఎలా తన లవర్ పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ ని ఎదుర్కొని తనని దక్కించుకున్నాడు' అన్నది పాత ఫార్ములానే కానీ మార్పు కోసం దానిని ఫాక్షన్ కామెడీ అనే ఫార్మాట్ లో ప్రెజంట్ చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు. నటీనటుల మంచి నటన, కామెడీ మరియు రొమాంటిక్ ట్రాక్ తో సాగే కృష్ణగాడి వీర ప్రేమగాథ ఈ వాలెంటైన్స్ డే కి మీ లవర్ తో కలిసి హ్యాపీ గా ఎంజాయ్ చేయదగిన సినిమా.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
krishna
-
prema
-
Telugu
-
Krishna gadi Veera Prema Gadha
-
Cinema
-
Nani
-
vishal krishna
-
Rayalaseema
-
Hindupuram
-
nandamuri taraka rama rao
-
king
-
King 1
-
Hyderabad
-
ramaraju
-
Sambandam
-
Love
-
Hero
-
Allari
-
Heroine
-
raj
-
Prabhas
-
Comedy
-
ravi anchor
-
sree
-
Director
-
hanu ragavapudi
-
Hanu Raghavapudi
-
Beautiful
-
Episode
-
marriage
-
Service
-
sathyam
-
Audience
-
sampath
-
Music
-
Ram Gopal Varma
-
vijay
-
Joseph Vijay
-
devineni avinash
-
Romantic
-
Lover
-
Success
-
Valentines Day