బిగ్ బాస్-3 హౌస్ లో ప్రభాస్..?
దీంతో నాగార్జున ఈ షో తో మరొకసారి టెలివిజన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయారు. ఇందులో భాగంగా ఇటీవల విడుదలైన షో ప్రోమో లో చాలా డిఫరెంట్ గా అలరించారు. ఇదిలావుండగా తాజాగా ఈ షో ప్రారంభం కాకముందే ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 3లోకి ప్రభాస్ ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట నాగార్జున.
ప్రభాస్ నటించిన సాహో మూవీ ఆగస్ట్ 15న విడుదల కానుండటంతో ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు కూడా చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడట నాగార్జున. ప్రభాస్ తో పాటు శ్రద్దా కపూర్ కూడా బిగ్ బాస్ లోకి రానునందని సమాచారం. మరి నాగార్జున ఆఫర్ కి ప్రభాస్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.