కళ్లు జిగేలుమనేలా బన్నీ కొత్త ఇల్లు..టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఐకాన్ స్టార్ న్యూ మ్యాన్షన్.. బడ్జెట్ ఎంతో తెలుసా..!
ఈ ఇంటి ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాని లొకేషన్. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అత్యంత సమీపంలో ఈ భవనం నిర్మించబడుతోంది. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే అల్లు అర్జున్, బంధాలను మరింత బలపరచుకునే ఉద్దేశంతోనే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.ఇప్పటికే ఈ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అన్ని పనులు పూర్తి అయిన వెంటనే, ఈ ఏడాది చివరి నాటికి అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఈ కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేయనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొత్తానికి, తన కెరీర్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా అల్లు అర్జున్ తీసుకుంటున్న ప్రతి అడుగు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కొత్త ఇంటి ద్వారా ఆయన లైఫ్ స్టైల్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రసెంట్ బన్నీ ..కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ గా ఉన్నాడు.