సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ హీరోయిన్ సోదరి..!
అలియా భట్ సోదరి షాహిన్ భట్ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈమె ఇషాన్ మెహ్రి అనే వ్యక్తితో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఈ జంట కలిసి ఉన్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మేము ఒకరినొకరు ఇష్టపడడంతో ఈ ఫోటోలతో ఇలా అతి చేశాను ఏమో అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ ని జోడించింది. ఇందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
షాహిన్ కాబోయే భర్త విషయానికి వస్తే స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ కోచ్గా రాణిస్తున్నారు. మహేష్ భట్, సోనీ రజ్దాన్ లకు షాహిన్ తో పాటుగా పూజా భట్ , ఆలియా భట్, రాహుల్ భట్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఆలియా భట్, రన్బీర్ కపూర్ వివాహం చేసుకోగ వీరికి రాహ అనే కూతురు కలదు. సినిమాల విషయనికి వస్తే చివరిగా ఆలయ భట్ జిగ్రా అనే చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ చిత్రంలో నటించడమే కాకుండా అలాగే ఒక తెలుగు సినిమాల్లో కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.