జైలర్ 2 సినిమా నుంచి సిన్స్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Divya
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రాలలో జైలర్ 2 సినిమా కూడా ఉంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుతున్న తరుణంలో తాజాగా చిత్ర బృందానికి ఒక పెద్ద షాక్ తగిలింది. అదేమిటంటే జైలర్ 2 సినిమాకి సంబంధించి రెండు సీన్స్ లీక్ అయ్యాయని సోషల్ మీడియాలో వైరల్ గా ఆ వీడియోలు మారుతున్నాయని వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న చిత్ర బృందం కూడా షాక్ అయ్యి ఆ క్లిప్స్ ను షేర్ చేయవద్దంటూ నిర్మాతలు కోరుతున్నారు.



లీకైన వీడియోల ప్రచారం పైన నిర్మాణ సంస్థ కూడా చాలా సీరియస్ గా ఉన్నది. పైరసీ నిరోధక టీమ్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ  ఈ వీడియోలు ఎలా వచ్చాయో అర్థం కాలేదని, వీడియోలు షేర్ చేస్తే కచ్చితంగా చర్యలు తప్పవని హెచ్చరించినా కూడా ఇలాంటి పనులు చేస్తున్నారని చిత్ర బృందం వాపోతోంది. లీకేజ్ అంశం పైన మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పటికే విజయ్ దళపతి నటించిన జననాయగన్ సినిమాకి సంబంధించి సీన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి కీలకమైన వ్యక్తులను కూడా పట్టుకున్నారు. జైలర్ 2 చిత్ర బృందం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ .600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు మళ్లీ అలాంటి కలయికలోని జైలర్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్లోనే తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు, శివరాజ్ కుమార్ కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. చివరిగా రజనీకాంత్ నటించిన కూలి సినిమాతో పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఎలాగైనా జైలర్ 2 సినిమాతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్న తరుణంలో ఇలా లీక్స్ అవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: